అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ, వాటి కోసం పడే పాట్లు, ఎంచుకునే దారులే వేరు. కొంతమంది వ్యాయామం చేస్తే, మరికొంతమంది కాస్మోటిక్స్ ట్రై చేస్తుంటారు. అయితే, థాయ్‌లాండ్‌కు చెందిన రోజాకోర్న్ నైనోన్ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్ ఉంది.
వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట. ఇక అప్పటి నుంచి రోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే! ‘మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది.
పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో ‘లావోఖానో’ అనే థాయ్ మద్యాన్ని కలిపి కాక్‌టెయిల్ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను’ అని కోర్న్ చెప్పాడు. ఈ మధ్యనే ఈ కాక్‌టెయిల్‌ను ఒక పెగ్ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్.
చదవండి: బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది!
Comments
Please login to add a commentAdd a comment