ప్రతి రోజు పబ్‌లో మద్యం తాగేదాన్ని: స్టార్ హీరోయిన్ | Shruti Haasan Shares Her Experience With Alcohol Drinking And Comments On Quitting Alcohol, Deets Inside - Sakshi
Sakshi News home page

Shruti Haasan On Quitting Alcohol: ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైంది: సలార్ హీరోయిన్

Dec 20 2023 3:09 PM | Updated on Dec 20 2023 3:51 PM

Shruti Haasan Shares Her Experience With Alcohol Drinking - Sakshi

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రవర్తన, పరివర్తనలకు శృతిహాసన్‌ కేరాఫ్‌గా మారారు. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సలార్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత నటుడు కమలహాసన్‌ తనయగా..  తండ్రి కథానాయకుడిగా నటించిన హే రామ్‌ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయౖమైన శృతిహాసన్‌, ఆ తరువాత హిందీలో లక్‌ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

(ఇది చదవండి: కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ)

అయితే చాలా విభిన్నమైన మనస్తత్వం కలిగిన నటి శృతిహాసన్‌. కారణం ఆమె పెరిగిన వాతావరణం కావచ్చు. ఈ ఏడాది తెలుగులో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు విజయం సాధించటం విశేషం. అదే విధంగా నాని కథానాయకుడిగా ఇటీవల విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న హాయ్‌ నాన్న చిత్రంలో కూడా మోడల్‌గా కీలక పాత్రలో నటించారు. తాజాగా ప్రభాస్‌ సరసన నటించిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ భారీఅంచనాల మధ్య తెరపైకి రానుంది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్‌ సలార్‌ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపింది. తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది. కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. నేను ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిస అయ్యానని పేర్కొన్నారు. ప్రతి రోజు నా స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లి మద్యం సేవించేదాన్ని అని తెలిపింది.

అయితే తనకు ఎలాంటి డ్రగ్స్ సేవించే అలవాటు మాత్రం లేదని శృతిహాసన్‌ చెప్పారు. అయితే కొన్ని రోజుల తరువాత మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైందని తెలిపింది. ఎలాగైనా ఆ వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికీ మద్యం మానేసి 8 ఏళ్లు పూర్తవుతోందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం తెలుగులో అడవి శేషు సరసన ఓ చిత్రం.. ఇంగ్లిష్‌లో ది ఐ అనే చిత్రంలోనూ శృతిహాసన్‌ కనిపించనుంది. 

(ఇది చదవండి: బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement