‘మద్యం చాయ్‌’.. ప్రయోగాలకు పరాకాష్ట అంటున్న జనం! | Man Made Alcoholic Tea by Mixing old Monk | Sakshi
Sakshi News home page

OLD Monk Tea: ‘మద్యం చాయ్‌’.. ప్రయోగాలకు పరాకాష్ట అంటున్న జనం!

Published Tue, Nov 7 2023 1:40 PM | Last Updated on Tue, Nov 7 2023 1:55 PM

Man Made Alcoholic Tea by Mixing old Monk - Sakshi

సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి టీ తయారీలో వినూత్న ప్రయోగం చేయడాన్ని చూడొచ్చు. ఆ వ్యక్తి ఒక చిన్న కుండలో మద్యం పోసి, దానితో టీ తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది యూజర్లు తెగ రియాక్ట్‌ అవుతున్నారు. ఒక యూజర్‌.. ‘సోదరా, మనం ఇకపై ఈ భూమిపై జీవించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించాడు. 

మరొక యూజర్‌ ఎప్పుడూ టీతోనే ఎందుకు ప్రయోగాలు జరుగుతాయి?’ అని ప్రశ్నించాడు. ఈ వీడియో చూసిన కొందరు ఆ టీ తయారీదారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో దేశీమోజిటో అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు పైగా వీక్షణలు దక్కాయి. ఇప్పుడే కాదు గతంలోనూ టీపై పలు ప్రయోగాలు జరిగాయి. ఈ జాబితాలో ఎగ్‌ టీ, ఫ్రూట్ టీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
ఇది కూడా చదవండి: పారిస్‌ ఎయిర్‌ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement