Rajnikanth Speech Latest: సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు చెప్పగానే ఆవేశంతో ఊగిపోయే ఫ్యాన్స్, విజిల్స్‌తో దద్దరిల్లే థియేటర్లు గుర్తొస్తాయి. అయితే 'రోబో' తర్వాత ఈయన రేంజ్‌కు తగ్గ మూవీస్ పడలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు 'జైలర్' కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 10న రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన తలైవా.. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో పశ్చాత్తాప పడ్డారు.
నేను చేసిన పెద్ద తప్పు
'నా జీవితంలో మద్యం అనేది లేకపోయింటే ఈ పాటికి నేను సమాజసేవ చేస్తుండేవాడిని. మందు తాగడం.. జీవితంలో నేను చేసిన అతిపెద‍్ద తప్పు. 'నువ్వు రాజువి మందు తాగొద్దు' అని నా తమ్ముడు అప్పటికీ చెబుతుండేవాడు. కానీ నేనే వినలేదు. ఒకవేళ నా లైఫ్‌లో ఆల్కహాల్ అనేది లేకపోయింటే.. ఇప్పుడున్న దానికంటే ఎంతో గొప్పస్థాయిలో ఉండేవాడిని, వ్యక్తిగతంగా కూడా'
(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)
మీ వల్ల వాళ్లకు ఇబ్బంది
'అయితే నేను పూర్తిగా మందు తాగొద్దు అని చెప్పడం లేదు. మీకు సరదాగా అనిపించినప్పుడు ఎప్పుడో ఓసారి తాగండి. కానీ రోజూ మాత్రం డ్రింక్ చేయొద్దు. ఎందుకంటే అది మీ ఆరోగ్యంతోపాటు మీ చుట్టూ వాళ్ల ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ మీరు తాగితే మాత్రం మొత‍్తం జీవితం తలకిందులైపోతుంది. మీ తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ మీ తాగుడు వల్ల ఇబ్బంది పడతారు. అందుకే మందు తాగొద్దు' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
మరి రజినీకాంత్ ఇంతలా చెప్పారు కానీ ఫ్యాన్స్ దీన్ని పాటిస్తారా అనేది సందేహమే. సరే ఇదంతా పక్కనబెడితే 'జైలర్' తెలుగులో పెద్దగా బజ్ లేదు. 'కావాలయ్యా' అనే పాట యూట్యూబ్, ఇన్ స్టాలో ట్రెండింగ్ లో ఉంది కానీ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందనేది చూడాలి. తమిళ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి సూపర్‌స్టార్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 10 వరకు ఆగాలి.
(ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?)
Comments
Please login to add a commentAdd a comment