
సోషల్ మీడియాలో వైరల్
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఒకరు మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం మంగళవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా సదరు ఉద్యోగి మద్యం తాగి విధి నిర్వహణకు రావడం పట్ల అప్పటి జిల్లా అధికారి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అయినా అదేవిధంగా మళ్లీ ఆ ఉద్యోగి మద్యం తాగి విధుల్లోకి రావడం, తాజాగా కార్యాలయంలోనే మద్యం తాగడంపై జిల్లా ఉన్నతాధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ అధికారుల తీరుమాత్రం మారకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి ఎండీ గౌస్ పాషాను వివరణ కోరగా కార్యాలయంలో మద్యం సేవిస్తూ ఉద్యోగం చేయడం సరికాదన్నారు. విషయం తెలిసిన వెంటనే సదరు ఉద్యోగిని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో ఔట్‌సోరి్సంగ్ ఏజెన్సీకి సరెండర్ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment