
తూమకుంట చెక్‌పోస్టు వద్ద దివాకర్‌ట్రావెల్స్ బస్సులో లభ్యమైన చీరల మూటలు
సాక్షి, హిందూపురం: దివాకర్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 1,500 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి బయలుదేరగా...తూమకుంట చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా రూరల్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు పది మూటల్లో ఉన్న 1,500 చీరలను గుర్తించారు. వాటికి ఎలాంటి రసీదులు లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీ చేసేందుకే చీరలు తరలిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు వాటిని స్వాధీనం చేస్తుకున్నారు. అలాగే బస్సులో సిగరేట్ బాక్సులు భారీగా ఉండగా.. వాటి రికార్డులు చూపించారు.
కర్టాటక మద్యం బాటిళ్లు స్వాధీనం
ఎక్సైజ్ పోలీసులు తూమకుంట చెక్‌పోస్టు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా..ఎనిమిది బాటిళ్ల కర్ణాటక మద్యం లభించింది. మద్యం అక్రమంగా తరలిస్తున్న మానేంపల్లి హనుమంతప్పను అరెస్టుచేసినట్లు ఎక్సైజ్ ఎస్‌ఐలు ఉమాదేవి, మల్లికార్జున తెలిపారు.