వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టేపిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు గోరంట్ల నామినేషన్‌కు అనుమతి ఇచ్చింది.