బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోవాలి.. | AP Whip Korumutla Srinivas Slams TDP MLA Balakrishna | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యేగా బాలకృష్ణ అనర్హుడు’

Published Fri, Jun 5 2020 2:48 PM | Last Updated on Fri, Jun 5 2020 3:57 PM

AP Whip Korumutla Srinivas Slams TDP MLA Balakrishna - Sakshi

ఆయన మానసిక పరిస్థితిపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు.

సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలో డాక్టర్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు.

పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడు. ఆయన వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బాలకృష్ణ భుజాన మోస్తున్నారు. చంద్రబాబు చచ్చిన పాము వంటివాడు. ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ పేరు తెచ్చుకున్నారు. తొలి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించిన ముఖ్యమంత్రి రానున్న నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో టీడీపీ నేతలు గ్రహించాలి. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయాడు’అని కోరుముట్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. (చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement