
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టేపిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు గోరంట్ల నామినేషన్‌కు అనుమతి ఇచ్చింది.
రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే గోరంట్ల వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీనిపై ట్రిబ్యునల్ తీర్పును వెలువరిస్తూ
తక్షణమే మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ఎస్‌ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టేపిటిషన్ వేసింది. కానీ హైకోర్టు ఆ పిటిషన్‌ను నిరాకరిస్తూ ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది. హిందూపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత ఈ రోజు (సోమవారం) నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment