
సాక్షి, అమరావతి: హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో పాటు హిందూపురానికి అనేక అనుకూలతలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇదే అంశంపై లేఖ రాశారు. హిందూపురం నియోజకవర్గంలోని మలుగూరు వద్ద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వేర్వేరుగా లేఖలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment