పిట్ట కొంచెం.. ప్రతిభ ఘనం: యంగ్‌ గెస్ట్‌ ట్యాలెండ్‌ కిడ్‌గా చిన్నారి | 1 Year Old Child Secured Place In Indias World Records At Hindupuram | Sakshi
Sakshi News home page

పిట్ట కొంచెం.. ప్రతిభ ఘనం: యంగ్‌ గెస్ట్‌ ట్యాలెండ్‌ కిడ్‌గా చిన్నారి

Published Sat, Feb 11 2023 9:14 AM | Last Updated on Sat, Feb 11 2023 10:36 AM

1 Year Old Child Secured Place In Indias World Records At Hindupuram  - Sakshi

సాక్షి, హిందూపురం టౌన్‌: తన ప్రతిభతో ఏడాది వయస్సున్న చిన్నారి ఇండియాస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌(ఐడబ్ల్యూఆర్‌)లో చోటు దక్కించుకుంది. హిందూపురం శ్రీకంఠపురంలో నివాసముంటున్న డాక్టర్‌ చరణ్‌కుమార్, సుష్మాల కుమార్తె జి.నైనిక వయస్సు ఏడాదే. కానీ 12 గృహోపకరణాలను, 10 జంతువులను గుర్తుపట్టడంతో పాటు 10 జంతువుల శబ్దాలనూ చేయగలదు.

ఈ నేపథ్యంలో ఐడబ్ల్యూఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన చిన్నారి నైనిక ప్రతిభను వీడియోల రూపంలో పరీక్షించారు. ఇందులో చిన్నారి ఇంటిలోని 12 వస్తువులను, అలాగే 10 జంతువులను గుర్తు పట్టి వాటి శబ్దాలు చేయడంతో ‘యంగ్‌ గెస్ట్‌ ట్యాలెండ్‌ కిడ్‌’గా రికార్డును అందజేశారు. ఈ మేరకు సర్టిఫికేట్‌ను శుక్రవారం అందజేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement