శ్రీ సత్యసాయి, సాక్షి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పచ్చనేతలు దాడులతో రెచ్చిపోతున్నారు.తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత రెచ్చిపోయాడు. హిందూపురంలో కొడవలితో టీడీపీ నేత శ్రీహరి నాయుడు వీరంగం సృష్టించాడు.
వినాయకుడి మండపం వద్ద డీజే పెట్టొద్దని.. పాటలు నిలిపివేయాలని గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా అక్కడి ఉన్నవారిపై దాడికి తెగబడ్డాడు.టీడీపీ నేత దాడిలో పాండురంగ అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీ నేత దౌర్జన్యం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment