టీడీపీ, జనసేన నాయకుల రౌడీయిజం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన నాయకుల రౌడీయిజం

Published Sat, May 27 2023 9:14 AM | Last Updated on Sat, May 27 2023 9:50 AM

వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ  - Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

హిందూపురం: టీడీపీ, జనసేన నాయకులు పట్టణంలో రౌడీయిజానికి దిగారు. శుక్రవారం రాత్రి స్థానిక రహమత్‌పురం సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘చూసుకుందాం రండి’ అంటూ సవాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పెత్తందారుల పక్షాన నిలిచి పేదలపై దాడి చేస్తుండగా.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నట్లు ఉన్న ఫ్లెక్సీలను వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టణ కూడలిలో ఏర్పాటు చేశారు.

దీంతో టీడీపీ నాయకులు రమేష్‌, రఘు, దాదు, అశోక్‌తో పాటు జనసేన నాయకులు ఆకుల ఉమేష్‌, శేఖర్‌, చక్రి మరికొంత మంది గొడవకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో వాగ్వాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరికీ సర్దిచెబుతుండగానే.. టీడీపీ, జనసేన నాయకులు కేకలు వేస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. అందరూ చూస్తుండగానే ఫ్లెక్సీలు చించి విసిరివేశారు. వారిని వారిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పక్కకు తోసేశారు. దీంతో పోలీసులు.. జనసేన, టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గొడవలకు దిగిన టీడీపీ, జనసేన నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జబీవుల్లా, నాయకులు లతీఫ్‌, కట్లబాషా, కౌన్సిలర్‌ అయూబ్‌, ఖలీల్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షాన నిలిచి వారిని కాచుకున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వీరికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. ప్రశాంతమైన హిందూపురంలో రౌడీయిజం, ఘర్షణలకు దిగి భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని సహించబోమని, ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఫ్లెక్సీలను చింపడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు1
1/1

ఫ్లెక్సీలను చింపడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement