janaseena party
-
సరికొత్త ఐడియా తో చివరి అస్త్రం ప్రయోగించిన బాబు
-
టీడీపీ, జనసేన రౌడీమూకల విధ్వంసకాండ
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాలెంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు విధ్వంసం సృష్టించారు. మద్యం తాగి గొడ్డళ్లు, ఇనుపరాడ్లు చేతపట్టుకుని అర్ధరాత్రి వేళ వైఎస్సార్సీపీకి చెందినవారి బైక్‌లను ధ్వంసం చేశారు. పుట్టావారిపాలెంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు రౌడీలు మద్యం తాగి శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గొడ్డళ్లు, ఇనుప రాడ్లు పట్టుకుని వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి హల్చల్ చేశారు. ఇళ్ల ముందు నిలిపిన 20 బైకులను ధ్వంసం చేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు తమ బైక్‌లను వదిలి పారిపోయారు. గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి 11 బైక్‌లు, ఇనుపరాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడిన రౌడీమూకలను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ పైనం ఏడుకొండలరెడ్డి, స్థానిక సర్పంచ్ మొగలిపువ్వు కోటేశ్వరరావు పోలీసులను కోరారు. -
జనసేనకు అనకాపల్లి టికెట్ కేటాయింపుపై గరంగరం
అనకాపల్లి (యలమంచిలి రూరల్)/కశింకోట/అనకాపల్లి: టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అనకాపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి రగిల్చింది. పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను కాదని జనసేనకు టికెట్ కేటాయించడం గందరగోళానికి దారితీసింది. ఇప్పటి వరకూ చంద్రబాబే తమకు ఇంద్రుడు, చంద్రుడు అని మాట్లాడినవారు ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత వైఖరినే తప్పుబడుతున్నారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు పార్టీ టికెట్ వస్తుందని ఆయన అనుచరగణం, టీడీపీ శ్రేణులు భావించాయి. కాని అనూహ్యంగా ఈ సీటు ను పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆదివారం కశింకోట, అనకాపల్లి పట్టణాలలో తెలుగు తమ్ముళ్ల నిరసనలు పెల్లుబుకాయి. చంద్రబాబు తీరుపై ఆ పార్టీ నేతలే తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. నెల రోజుల కిందట జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాలను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపడం సరికాదంటున్నారు. ఈ మేరకు ఆదివారం కశింకోట మండల టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. తామంతా పీలా వెంటే ఉంటామని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని అధినేతకు హెచ్చరికలు పంపారు. అనకాపల్లిలో కూడా టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇలాంటి పొత్తుల వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని, పార్టీకి అనుకూలంగా వున్న సీటును జనసేనకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. నమ్మకాన్ని వమ్ము చేయడమే చంద్రబాబు నైజమని సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్టు చేయడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని తెచ్చింది. చంద్రబాబుకు మాటపై నిలబడే తత్వం లేదని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని నియోజకవర్గ టీడీపీ ముఖ్యనాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనా మా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కశింకోట మండల టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కశింకోటలోని గౌరమ్మ ఆలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో తీవ్ర నిరసన తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కష్టపడి నియోజక వర్గంలో కార్యకర్తలను నిరంతరం ఉత్తేజపరిచి పార్టీని నిలబెట్టుకుంటూ పటిష్టవంతం చేసిన పీలా వంటి వ్యక్తికి సీటు ఇవ్వకుండా తీవ్ర అన్యా యం చేశారని విమర్శించారు. పార్టీ శ్రేణులకు తెలియకుండా జనసేనకు టికెట్ కేటాయించడం శోచనీయమన్నారు. అధిష్టానం పునరాలోచించాలని కోరారు. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తే పనిచేస్తామన్నారు. అయితే ఎమ్మెల్యే సీటు మాత్రం పీలాకు ఇవ్వాలన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెంటకోట రాము, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వేగి గోపీకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బుదిరెడ్డి గంగయ్య పాల్గొన్నారు. గెలవలేని పార్టీతో మనకెందుకు పొత్తు గెలవలేని జనసేన పార్టీతో టీడీపీకి పొత్తు ఎందుకని, అన్ని స్థానాలకు టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలని టీడీపీ సీనియర్ నాయకుడు బొద్దపు ప్రసాద్ డిమాండ్ చేశారు. అనకాపల్లి గవరపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తు కారణంగా టీడీపీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని, అధిష్టానం పునరాలోచించాలని కోరారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వైఎస్సార్సీపీకి విజయావకాశాలు పెరుగుతాయన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు, లోకేష్‌లు అనకాపల్లి వచ్చినప్పుడు పార్టీ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లిలో జరిగిన శంఖారావం సభలో అనకాపల్లి టికెట్ పీలాకే ఇస్తామని లోకేష్ పార్టీ శ్రేణులకు చెప్పిన విషయం గుర్తు చేశారు. తొలి నుంచి జనసేన నిర్మాణంలో పాల్గొన్న పరుచూరి భాస్కరరావుకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన కొణతాలకు టికెట్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పార్టీ నేతలు మళ్ల సురేంద్ర, కాయల ప్రసన్నలక్ష్మి, అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
పతనావస్థ దిశగా ప్యాకేజ్ స్టార్ పరుగులు!
పేరుకు సొంత జిల్లా అయినా చంద్రబాబుకు ఏనాడూ ప్రజల మద్దతు దక్కలేదు.. పొత్తుల పేరుతో ఇతర పార్టీలతో కలిసి వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు.. అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని యత్నించినా ప్రయోజనం చేకూరలేదు.. మళ్లీ పాత కథే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో టీడీపీ అధినేతకు దిక్కుతోచడం లేదు. అసలే బలమైన అభ్యర్థులు లేక ఆందోళన చెందుతున్న బాబుగారికి భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ఎలాగైనా విజయావకాశాలు మెరుగుపరుచుకోవాలనే దురాలోచన చేస్తున్నట్లు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చివరకు టీడీపీ.. జనసేన నేతల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చివరకు టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కల్పిస్తున్నారు. కీలకమైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. పొత్తులో భాగంగా పై మూడు స్థానాలను జనసేన కోరకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలిసిందే. తన నైజానికి తగ్గట్టు చంద్రబాబు ఆయా స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చినా, వీటిని వదులు కోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా ఈ స్థానాల్లో కూడా తమ అభ్యర్థులనే బరిలోకి దింపాలని టీడీపీ అంతర్గత సమావేశంలో నిర్ణయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. నేడో, రేపో చేరిక ఉండవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. జన బలమే కాదు.. పార్టీ కమిటీలకు దిక్కులేని జనసేన నాయకులమని చెప్పుకునే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ మాత్రం ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నా పైకి మాత్రం భాయ్భాయ్ అని కలరింగ్ ఇచ్చుకు తిరుగుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన జనసేన నేతలతో పరిచయ కార్యక్రమంలో తలెత్తిన వివాదంపై పసుపులేటికి షోకాజ్ నోటీసు ఇవ్వడం వెనుక కిరణ్ రాయల్ హస్తం ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. మరికొందరికి సీటు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. భారంగా ‘రా కదలిరా’ అభ్యర్థుల విషయమే తేల్చకుండా.. చంద్రబాబు ‘రా కదలి రా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా, పచ్చ పత్రిలు, ఎల్లో ఛానళ్లలో తప్ప టీడీపీ గురించి పట్టించుకోని జనంలో పార్టీకి హైప్ తెచ్చేందుకే ఎన్నికల ముందు ఈ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘రా కదలిరా’ను అట్టహాసంగా చేపట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు హుకుం జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తలకు మించిన భారంగానే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చేసేది లేక ఎక్కడికక్కడ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నుంచి తమ పార్టీలోకి పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతున్నాయని ప్రజలను నమ్మించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో కంటికి కనిపించిన వారిని పట్టుకువచ్చి పచ్చ కండువా కప్పేస్తున్నారు. వారందరూ వైఎస్సార్సీపీ నుంచి వలస వచ్చేస్తున్నారని కలరింగ్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం కుప్పం మండలం మల్లనూరు సమీపంలోని టి.సదుమురు, హెచ్.కొట్టాల గ్రామాలకి చెందిన పలువురిని తీసుకెళ్లి టీడీపీ కండువాలు కప్పేసి ఫొటోలకు ఫోజులిప్పించేశారు. తమ్ముళ్ల అవస్థలు పసిగట్టిన ప్రజలు బాహాటంగానే నవ్వుకుంటుండడం కొసమెరుపు. చిత్తూరులో బాబు చిచ్చు చిత్తూరులో టీడీపీ జెండా మోసేవారు కరువైన సమయంలో మాజీ మేయర్ కఠారి హేమలత, మరి కొందరు టీడీపీ శ్రేణులు పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిత్వం తమకే దక్కుతుందనుకున్న కఠారి హేమలత, బాలాజీ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. కొత్తగా జగన్మోహన్ అనే వ్యక్తిని రంగంలోకి దింపారు. కొంత కాలంగా జగన్మోహన్ చిత్తూరులోనే ఉంటూ ప్రజలకు రకరకాల బహుమతులు పంపిణీ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. చిత్తూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జగన్మోహన్కు సైతం చంద్రబాబు హ్యాండిచ్చేశారు. తాజాగా డీకే ఆదికేశవులు నాయుడు బంధువులను రంగంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. చాలా కాలంగా బెంగళూరుకే పరిమితమైన డీకే కుటుంబీకులు కొద్ది రోజులుగా చిత్తూరు, శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యకు జనసేన కండువా కప్పించారు. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, టీడీపీ దివంగత నేత గురవయ్య నాయుడుకు ఈమె కోడలు. అందుకే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బొజ్జల సుధీర్‌రెడ్డి అభ్యర్థిగా పనికిరాడని స్థానిక టీడీపీ నేతలు కొందరు చంద్రబాబుకు వెల్లడించినట్లు సమాచారం. అవగాహన రాహిత్యం, అసభ్య పదజాలంతో సుధీర్‌రెడ్డి మాట్లాడిన మాటలు, ప్రవర్తనపై బాబుకు వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొజ్జల సుధీర్ అభ్యర్థిగా పనికి రాడనే అభిప్రాయానికి ఆ పార్టీ అధినేత వచ్చినట్లు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చిత్తూరు విషయానికి వస్తే.. డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబంలోని వ్యక్తికే అభ్యర్థిత్వం ఇవ్వాలని భావించిన చంద్రబాబు.. తాజాగా మరో వ్యక్తికి ఫోన్‌చేసి టికెట్ ఆఫర్ చేసినట్లు తెలియడం గమనార్హం. -
నిద్రలో కూడా ఉలిక్కిపడి పొత్తులు అంటున్నాడు పవన్ కళ్యాణ్...YSRCP బలం ఏంటో అక్కడే తెలుస్తుంది...
-
వారాహి తాళం దొరికిందా ..?
-
టీడీపీ, జనసేన నాయకుల రౌడీయిజం
హిందూపురం: టీడీపీ, జనసేన నాయకులు పట్టణంలో రౌడీయిజానికి దిగారు. శుక్రవారం రాత్రి స్థానిక రహమత్‌పురం సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘చూసుకుందాం రండి’ అంటూ సవాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పెత్తందారుల పక్షాన నిలిచి పేదలపై దాడి చేస్తుండగా.. సీఎం జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు ఉన్న ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ నాయకులు పట్టణ కూడలిలో ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నాయకులు రమేష్, రఘు, దాదు, అశోక్‌తో పాటు జనసేన నాయకులు ఆకుల ఉమేష్, శేఖర్, చక్రి మరికొంత మంది గొడవకు దిగారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో వాగ్వాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరికీ సర్దిచెబుతుండగానే.. టీడీపీ, జనసేన నాయకులు కేకలు వేస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. అందరూ చూస్తుండగానే ఫ్లెక్సీలు చించి విసిరివేశారు. వారిని వారిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను పక్కకు తోసేశారు. దీంతో పోలీసులు.. జనసేన, టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గొడవలకు దిగిన టీడీపీ, జనసేన నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, నాయకులు లతీఫ్, కట్లబాషా, కౌన్సిలర్ అయూబ్, ఖలీల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన నిలిచి వారిని కాచుకున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వీరికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. ప్రశాంతమైన హిందూపురంలో రౌడీయిజం, ఘర్షణలకు దిగి భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని సహించబోమని, ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని స్పష్టం చేశారు. -
జనసేన శ్రేణుల్లో కలకలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజా సమస్యలపైనే మాట్లాడతాం.. ప్రజల పక్షాన నిలిచి పోరాడతాం.. ప్రశ్నించే పార్టీ మాది.. ప్రజల కోసం పనిచేసేది మేమే అంటూ జనసేన నేతలు రోజూ హడావుడి చేస్తుంటారు. అలాంటి జనసేన జిల్లా ముఖ్యనేత ప్రశ్నిస్తాను.. నిలదీస్తానంటూ పగటిపూట హంగామా చేస్తూ రాత్రిళ్లు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా కిడ్నాప్ యత్నాలు కూడా తన గ్యాంగ్‌తో కలిసి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన నేత, వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు జయప్రకాష్‌నాయుడు (జేపీ) తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా తణుకులో భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిపై దాడి, కిడ్నాప్ యత్నానికి పాల్పడిన ఘటనలో పోలీసులు అతడితో పాటు, 8 మంది అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అలాగే గతంలోనూ అతడిపై పలు కేసులు ఉన్నాయి. తీవ్ర చర్చనీయాంశంగా.. జిల్లా జనసేన పార్టీలో జయప్రకాష్‌నాయుడు తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్న ఏకై క జెడ్పీటీసీ (ప్రజాప్రతినిధి) కావడంతో పార్టీలో ప్రాధాన్యత ఉంది. భీమవరం జనసేనలో జయప్రకాష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. అనుచరగణంతో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ర్యాలీలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా ఒక కోణం. మరో కోణంలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం, కొందరు బ్యాంకర్ల సహకారంతో నకిలీ బ్యాంకు ష్యూరిటీలు సృష్టించి పొరుగు రాష్ట్రాలను బురిడీ కొట్టించేలా టెండర్లు వేయడం, తీరా విచారణకు ఆదేశిస్తే కోర్టులకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా ఇతడిపై భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో తొమ్మిదికి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా దాడులు, దౌర్జన్యాలు, స్థలవివాదాల కేసులుండటం అతని వ్యవహార శైలికి నిదర్శనం. కొన్ని నెలల క్రితం తెలంగాణలో మత్స్యశాఖ చేపల పెంపకానికి సంబంధించి టెండర్లు ఆహ్వానించగా పాలకొల్లులో ఓ బ్యాంకుకు సంబంధించి నకిలీ ష్యూరిటీలు సిద్ధం చేసి జయప్రకాష్‌నాయుడు టెండర్లు వేశారు. ఇవి నకిలీ ష్యూరిటీలని తేలడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అలాగే జయప్రకాష్నాయుడిపై భీమవరం వన్‌టౌన్, టూటౌన్, పాలకోడేరు, వీరవాసరం పోలీస్స్టేషన్లల్లో 9 కేసులకుగాను రెండు కేసులు పూర్తికాగా, మరో ఏడు కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 2014లో నకిలీ పత్రాలతో భవనం కబ్జాకి యత్నించారనే కేసు, వీరవాసరంలో ప్రభుత్వ భూమి కబ్జాకి యత్నాంచారని మరో కేసు, వీరవాసరంలో ఓ ఇంటి ప్రహరీ గోడ కూల్చి ఇంటి యజమానిపై దాడికి పా ల్పడిన కేసులు ఉన్నాయి. మొత్తంగా జయప్రకాష్నాయుడి వ్యవహారం మరోసారి జనసేన శ్రేణుల్లో కలకలం రేపింది. అరెస్ట్.. రిమాండ్ తణుకు: వ్యక్తిపై దాడి చేసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనకు సంబంధించి వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడుతోపాటు మరికొందరిపై తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తణుకు పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన కొలువూరు శ్రీరామరెడ్డికి జెడ్పీటీసీ గుండా జయప్రకాష్నాయుడుకి మధ్య గతం నుంచి ఘర్షణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈనెల 27న శ్రీరామరెడ్డి వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న తణుకు పాతవూరుకు చెందిన నడిపూడి వెంకటశ్రీనివాస్ను స్థల వివాదంలో జయప్రకాష్నాయుడుతోపాటు మరికొందరు దాడి చేసి చంపుతానని బెదిరించారు. శ్రీనివాస్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌నకూ ప్రయత్నించారు. తన వద్ద సెల్‌ఫోన్, పర్సు లాక్కుని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయప్రకాష్నాయుడుతోపాటు సవరపు నాగసుబ్రహ్మణ్యం, మద్దాల సత్యసాయిబాబా, గ్రంధి రత్నకిషోర్, కరీంశెట్టి వీరవెంకట సత్యనారాయణమూర్తి, జవ్వాది మావుళ్లు, కొల్లాటి జయకృష్ణ, జోడ నాగరాజు, దేవా సాయికృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం కో ర్టులో హాజరుపరిచారు. రెండో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నాగరాజు నిందితులకు వచ్చేనెల 11 వరకు రిమాండ్ విధిస్తూ తీరు చెప్పినట్టు సీఐ సత్యనారాయణ చెప్పారు. -
అయోమయంలో పవన్ కల్యాణ్
-
2019 ఎన్ని'కలలో'..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొత్త సంవత్సరం కోటి ఆశలతో మొదలు కానుంది. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అందరిలోనూ ఆశలు చిగురుస్తున్నాయి. 2018 అభివృద్ధిపరంగా జిల్లాకు చేదు అనుభవమే మిగిల్చింది. సహజ వనరులు, మౌలిక సదుపాయాలు అన్నీఉన్నా పారిశ్రామికంగా వెనకబాటుతనం ఇంకా పోలేదు. చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ రాలేదు. పరిశ్రమల కోసం భూమి సేకరించే ప్రక్రియ ఇంకా నడుస్తోంది. ఇతర అంశాల్లోనూ ఆశించిన ప్రగతి లేదు. ఆగస్టులో భారీ వర్షాలు, చివరిలో పెథాయ్ తుపాను వ్యవసాయ రంగాన్ని కకావికలం చేశాయి. ప్రభుత్వం నుంచి సాయం ఏమాత్రమూ అందలేదు. మిగతా రంగాల్లోనూ ఆశించిన ప్రగతి లేదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ ముఖచిత్రం మారనుంది. అధికారపక్షం పనితీరు పేలవం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు ఇచ్చిన హామీలు ఒక్కటీ 2018లో నెరవేర్చలేదు. 2019 ఎన్నికల వత్సరం కావాడంతో మళ్లీ హామీలు గుప్పిస్తారా లేక ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అన్నది వేచిచూడాలి. ఇప్పటి వరకూ జిల్లా పర్యటనల్లో సీఎం అర్ధసెంచరీ దాటినా పట్టిసీమ, పోలవరం భజన తప్ప ఒక్క హామీ కూడా అమలు చేసినట్లు చెప్పుకోలేని పరిస్థితి. పరిశ్రమల కోసం అటవీ శాఖ భూములను డీ–నోటిఫై చేయకుండా ఫైలును కేంద్రం తిరస్కరిం చింది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి సహకరించలేదంటూ మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాజీ మంత్రి రాజీనామా అస్త్రాన్ని సంధించడం ఏడాది చివరిలో కొసమెరుపు. కుమ్మలాటలు, విభేదాలు మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో విబేధాలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. తెలుగుదేశంతో ప్రత్యక్ష యుద్ధానికి మాజీ మిత్రపక్షం బీజేపీ దిగింది. ఇసుక, మట్టి ఏదీ వదలకుండా మూడేళ్లు దోచుకోవడంపైనే అధికార టీడీపీ దృష్టి పెట్టింది. ప్రజాప్రతినిధులు వందల కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతి నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు పెరుగుతూ వస్తున్నాయి. కోడి పందేలు, జూదాలు, మద్యం సిండికేట్లలో పెత్తనం చేస్తూ ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. చింతలపూడిలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే పీతల సుజాత మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి జవహర్‌కు అసమ్మతి సెగ తగిలింది. ఆయనను వ్యతిరేకిస్తున్న వర్గం ఏకంగా రెండో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి షాక్ ఇచ్చింది. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్యే అంగర రామమోహనరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే పరిస్థితి నర్సాపురం, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలలో ఉన్నాయి. సీఐల బదిలీల వ్యవహారంలో ఉండి ఎమ్మెల్యేకి, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. పోరుబాటలో వైఎస్సార్ సీపీ ప్రజలను అన్ని విధాల మోసం చేసిన పాలకులపై ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సన్నద్ధం అవుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన పాదయాత్రతో శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. 2018 మే 13 నుంచి జూన్ 12 వరకూ సుమారు నెలరోజుల పాటు జిల్లాలో 316 కిలోమీటర్లు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేశారు. జిల్లా ప్రజలు వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలికారు. మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ రంగనాథరాజు, మద్దాల సునీత, జవహర్వతి పార్టీలో చేరారు. పాదయాత్ర నింపిన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. రావాలి జగన్, కావాలి జగన్ పేరుతో మరోమారు ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తున్నారు. సర్కారు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నారు. జనసేనలో గందరగోళం దాదాపు నెలరోజుల పాటు జిల్లాలో పవన్‌కల్యాణ్ బసచేసినా పార్టీకి ఒక రూపు మాత్రం రాలేదు. పార్టీలో చేరిన ఇర్రింకి సూర్యారావు, యర్రా నవీన్, మల్లుల లక్ష్మీనారాయణ వంటి నేతలు మినహా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల నేతలు ఆ పార్టీలో చేరలేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో ఎవరు నాయకులో కనీసం వారికే తెలియని సందిగ్ధం నెలకొంది. మరో నాలుగునెలల్లో ఎన్నికలు ఉన్నా ఇప్పటికీ పార్టీ సంస్థాగత యంత్రాంగం లేకపోవడం ఆ పార్టీ సానుభూతిపరుల్లో అసంతృప్తి నింపుతోంది. బీజేపీ భవితవ్యమూ ప్రశ్నార్ధకమే! ఓ ఎంపీ, ఓ మంత్రి ఉన్నా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జిల్లా రాజకీయాలపై ఏమాత్రం ప్రభావం చూపలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. అయితే మంత్రివర్గం నుంచి వైదొలగిన తర్వాత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికార పార్టీపై యుద్ధం ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధిపై బహిరంగం చర్చకు సిద్ధమంటూ ప్రకటించారు. 15 రోజుల్లో నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. మరోవైపు ఎంపీ గోకరాజు గంగరాజు మాత్రం ఇప్పటికీ తెలుగుదేశంపై నోరుమెదపడం లేదు. నామమాత్రంగా వామపక్షాలు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారడంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రంగా మారిపోయాయి. అడపాదడపా తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాటంతో పాటు ప్రజా సమస్యలపై ధర్నాలకు పరిమితమయ్యారు. ఈ ఏడాదిలో సీపీఎం రాష్ట్ర మహాసభలు జిల్లాలోనే నిర్వహించుకోవడం ఒక్కటే వామపక్షాలకు గుర్తుంచుకునే అంశంగా మారింది. -
పవన్ కల్యాణ్ కారుపైకి ఎక్కిన యువకుడు
నిడదవోలు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు భద్రతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో పవన్ కల్యాణ్ కారుపైకి ఓ యువకుడు దూసుకురావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పవన్‌కు కల్పిస్తున్న భద్రత ఇదేనా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం పర్యటనలో భాగంగా విజయవాడ నుండి పవన్ శనివారం బయలుదేరారు. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు మీదుగా వెళుతున్నట్లు జనసేన నాయకులకు సమాచారం రావడంతో పట్టణంలో శనివారం రాత్రి గాంధీబొమ్మ సెంటర్‌కు యువకులు, కార్యకర్తలు చేరుకున్నారు. పవన్ కల్యాణ్ పట్టణంలోకి చేరుకోగానే కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో పవన్ కల్యాణ్ కారులోంచి పైకి లేచి జనాలకు అభివాదం చేయడానికి ప్రయత్నించే లోపే గుంపులోంచి ఓ యువకుడు కారు ముందు భాగంపైకి దూసుకుపోయాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఉలిక్కిపడ్డారు. పవన్ వెంటనే కారులో కిందకు కుర్చుండి పోయారు. భద్రతా సిబ్బంది తేరుకుని కారుపై ఉన్న యువకుడ్ని కిందకు దింపేశారు. అనంతరం పవన్ కల్యాణ్ కారులోంచి మళ్ళీ పైకి వచ్చి అభివాదం చేసుకుంటూ కారు దిగకుండా వెళ్ళిపోయారు. -
ఇవేం పరామర్శలో..
ఒంగోలు టూటౌన్: ఎవరైనా చనిపోతే బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించడం సహజం. కానీ, జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఇళ్లకు వెళ్లడానికి బదులుగా వారందరినీ ఓ చోటుకు పిలిపించి, పరామర్శించేందుకు ఏర్పాటు చేయడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. గత నెల కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో జిల్లాకు చెందిన పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాద బాధిత కుటుంబాలను పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వెళ్లి పరామర్శించారు. ఇదంతా జరిగి 20 రోజులు దాటాక శనివారం పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్నారు. కృష్ణా నదిలో పడవ ప్రమాద బాధిత కుటుంబాలను తొలుత ఆయన పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా ప్రతినిధులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించే తీరుపై రెండు రోజులుగా జిల్లాలో చర్చానీయాంశమైంది. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లకుండా.. అసలే విషాదంలో ఉన్న వారందరినీ ఎన్టీఆర్ కళాక్షేత్రానికి పిలిపించి పరామర్శించడమేమిటంటూ నోరేళ్ల బెడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు చేరిన ప్రతిచోట ఇదే టాఫిక్ వినపడుతోంది. బాధిత కుటుంబాలకు పరామర్శ తరువాత ఒంగోలులోని ఏ–1 కన్వెన్షన్ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ కార్యకర్తలతో పవన్‌కల్యాణ్ సమావేశమవుతారని జనసేన సేవాదళ్ ప్రతినిధి రావూరి బుజ్జి తెలిపారు. -
జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'
-
జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ తలపెట్టిన కాకినాడ బహిరంగ సభకు పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం నిర్వహించనున్న ఈ సభకు 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'గా నామకరణం చేసినట్లు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య ఆదివారం తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ క్రీడామైదానంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంపై తిరుపతి సభలో పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నలను సంధించారు. ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదని సీఎం చంద్రబాబును ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.