
నిడదవోలు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు భద్రతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో పవన్ కల్యాణ్ కారుపైకి ఓ యువకుడు దూసుకురావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పవన్‌కు కల్పిస్తున్న భద్రత ఇదేనా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం పర్యటనలో భాగంగా విజయవాడ నుండి పవన్ శనివారం బయలుదేరారు. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు మీదుగా వెళుతున్నట్లు జనసేన నాయకులకు సమాచారం రావడంతో పట్టణంలో శనివారం రాత్రి గాంధీబొమ్మ సెంటర్‌కు యువకులు, కార్యకర్తలు చేరుకున్నారు.
పవన్ కల్యాణ్ పట్టణంలోకి చేరుకోగానే కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. దీంతో పవన్ కల్యాణ్ కారులోంచి పైకి లేచి జనాలకు అభివాదం చేయడానికి ప్రయత్నించే లోపే గుంపులోంచి ఓ యువకుడు కారు ముందు భాగంపైకి దూసుకుపోయాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఉలిక్కిపడ్డారు. పవన్ వెంటనే కారులో కిందకు కుర్చుండి పోయారు. భద్రతా సిబ్బంది తేరుకుని కారుపై ఉన్న యువకుడ్ని కిందకు దింపేశారు. అనంతరం పవన్ కల్యాణ్ కారులోంచి మళ్ళీ పైకి వచ్చి అభివాదం చేసుకుంటూ కారు దిగకుండా వెళ్ళిపోయారు.