జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' | janaseena seemadhardhula atma gourava sabha on september 9th at kakinada | Sakshi
Sakshi News home page

జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'

Published Sun, Sep 4 2016 6:21 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' - Sakshi

జనసేన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ తలపెట్టిన కాకినాడ బహిరంగ సభకు పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం నిర్వహించనున్న ఈ సభకు 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'గా నామకరణం చేసినట్లు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య ఆదివారం తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ క్రీడామైదానంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు.
 
ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంపై తిరుపతి సభలో పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నలను సంధించారు. ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదని సీఎం చంద్రబాబును ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement