ఒంగోలు టూటౌన్: ఎవరైనా చనిపోతే బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించడం సహజం. కానీ, జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఇళ్లకు వెళ్లడానికి బదులుగా వారందరినీ ఓ చోటుకు పిలిపించి, పరామర్శించేందుకు ఏర్పాటు చేయడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. గత నెల కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో జిల్లాకు చెందిన పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాద బాధిత కుటుంబాలను పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వెళ్లి పరామర్శించారు.
ఇదంతా జరిగి 20 రోజులు దాటాక శనివారం పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్నారు. కృష్ణా నదిలో పడవ ప్రమాద బాధిత కుటుంబాలను తొలుత ఆయన పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా ప్రతినిధులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వారిని పరామర్శించే తీరుపై రెండు రోజులుగా జిల్లాలో చర్చానీయాంశమైంది. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లకుండా.. అసలే విషాదంలో ఉన్న వారందరినీ ఎన్టీఆర్ కళాక్షేత్రానికి పిలిపించి పరామర్శించడమేమిటంటూ నోరేళ్ల బెడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు చేరిన ప్రతిచోట ఇదే టాఫిక్ వినపడుతోంది. బాధిత కుటుంబాలకు పరామర్శ తరువాత ఒంగోలులోని ఏ–1 కన్వెన్షన్ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ కార్యకర్తలతో పవన్‌కల్యాణ్ సమావేశమవుతారని జనసేన సేవాదళ్ ప్రతినిధి రావూరి బుజ్జి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment