కొత్త లుక్‌ గురూ! | Sukumar Ram Charan New Movie Pre Look Poster Out | Sakshi
Sakshi News home page

కొత్త లుక్‌ గురూ!

Published Mon, Jan 30 2017 11:17 PM | Last Updated on Wed, Jul 25 2018 3:25 PM

కొత్త లుక్‌ గురూ! - Sakshi

కొత్త లుక్‌ గురూ!

దర్శకుడు సుకుమార్‌ చిత్రమంటే టైటిల్స్, పోస్టర్స్‌ దగ్గర్నుంచీ వైవిధ్యం కనిపిస్తుంది. సినిమా థీమ్‌కి తగ్గట్టు ప్రతిదీ డిజైన్‌ చేస్తారీ లెక్కల మాస్టారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ హీరోగా తీయబోయే పల్లెటూరి ప్రేమకథా చిత్రం పోస్టర్‌లోనూ వైవిధ్యం చూపించారు. చరణ్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సీవీఏం) నిర్మించనున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా... కావిడి బిందెలతో నీళ్లు తీసుకువెళ్తున్న ఓ గ్రామీణ యువకుడి పెన్సిల్‌ స్కెచ్‌ ఫొటో విడుదల చేశారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌ ఇవ్వగా, రామ్‌చరణ్‌ కెమేరా స్విచ్చాన్‌ చేశారు. కొరటాల శివ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘రామ్‌చరణ్‌ని సరికొత్త లుక్‌లో ఆవిష్కరించే వినూత్న కథని సుకుమార్‌ సిద్ధం చేశారు. కథానాయికగా సమంత, కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్‌నూలి, కెమేరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement