
టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఓ పక్క దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్‌లు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే, అలనాటి నటి సావిత్రి జీవితగాథ ‘మహానటి’ మాత్రం షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంది. కీర్తి సురేష్.. దుల్కర్ సల్మాన్, సమంత ‘మధురవాణి’ పాత్రకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. (తొలి ఎంపిక సమంతే)
ఈ పోస్టర్‌లో స్కూటర్‌పై వెళ్తున్న విజయ్.. అచ్చం పాతకాలపు సినిమా హీరోలా ఉన్నాడు. ‘నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణీ గారు’ అంటూ పోస్టర్‌పై సందేశం ఉంది. అంటే ఈ సినిమాలో విజయ్, సమంతలు స్నేహితులై ఉండొచ్చు. ఈ సినిమాలో విజయ్ పాత్ర పేరు కూడా విజయ్ ఆంటోని అని స్పష్టత ఇచ్చేశారు. మే 9న ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
The charm of the 80's :)
— Vijay Deverakonda (@TheDeverakonda) 10 April 2018
Tana Peru Vijay Anthony.
Absolute honour to play a part in telling her story.#Mahanati #NadigaiyarThilagam #MahanatiOnMay9th pic.twitter.com/kY0KpWzgG1