13న గద్వాలలో కేటీఆర్ పర్యటన: మంద జగన్నాథం
మహబూబ్‌నగర్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌లు ఈనెల 13వ తేదీన జిల్లాలోని అలంపూర్, గద్వాలలో పర్యటించనున్నట్లు నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం తెలిపారు. సోమవారమిక్కడ కొండేరు గ్రామంలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌ను పట్టభద్రులు, ఉద్యోగ సంఘాల వారు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిప్రకాష్, నాయకులు గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(ఇటిక్యాల)