ktr tour
-
ఉప రాష్ట్రపతిని కలసిన మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు ఉదయం మేఘాలయ సీఎం సీకే సంగ్మాను కూడా కేటీఆర్ కలుసుకున్నారు. ఈ భేటీపై సీకే సంగ్మా సామాజిక మాధ్యమంలో.. ‘నా ప్రియమైన స్నేహితుడు కేటీ రామారావును కలుసుకోవడం గొప్పగా ఉంది’అంటూ పంచుకున్నారు. సంగ్మాతో చిన్న సమావేశమే అయినా అద్భుతంగా జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ‘సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీం’ను గురువారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గతంలో ఐఎస్బీలో జరిగిన సమావేశంలో పిజ్జా అవుట్ కార్యక్రమానికి హాజరవుతానని కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘సన్నాహక’ సమరభేరి
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికలకు కరీంనగర్ నుంచి సమర శంఖారావం పూరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వరంగల్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఎన్నికల శంఖారావం పూరించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సన్నాహక సభ కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ‘ఓ సిటీ’ మైదానం ముస్తాబైంది. వరంగల్ మహా నగరం మొత్తం గులాబీమయమైంది. ఏర్పాట్లు పూర్తి.. సన్నాహక సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ నేతలు అందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి దయాకర్‌రావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఏ లోటూ రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశం ద్వారా సత్తా చాటేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కేడర్‌కు దిశానిర్ధేశనం... టీఆర్ఎస్కు అన్ని విధాలా కలిసొచ్చే కరీంనగర్ వేదికగా కేటీఆర్ బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించగా... తెలంగాణలో రెండో సన్నాహక సమావేశం వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బా«ధ్యతలు చేపట్టిన కేటీఆర్ మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలతో పాటు ఆయా జిల్లాల నేతలతో ముఖాముఖి, సమన్వయం చేయడంలో నిమగ్నమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారం మేరకు 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సూచన మేరకు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాల నిర్వహణ పూర్తిగా కేటీఆర్ ఆధ్యర్యంలో జరుగుతుండగా, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో చర్చించి, షెడ్యూలు ఖరారు చేశారు. ఇందులో భాగంగానే గురువారం వరంగల్‌లో నిర్వహించే సన్నాహక సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ ఎన్నికల సమావేశమైనా బహిరంగ సభను మరిపించే రీతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో జరిగిన అభివృద్ధి, ఎంపీ కృషి, రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలపై నిర్వహించిన పాత్ర, పార్టీని పటిష్ఠం చేసేందుకు జరిగిన కృషి తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి ఆదర్శంగా సాగుతున్న పాలన, అనేక సంక్షేమ పథకాలు, జాతీయ రాజకీయాల్లో పార్టీ పురోగమనం వంటి వాటిని ఆయన పార్టీ నేతలకు వివరించనున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వేదికకు... కరీంనగర్ నుంచి బుధవారం లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించిన కేటీఆర్ అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి బయలదేరనున్న ఆయనకు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రులు, ముఖ్యనేతలు వరంగల్ ఓ సిటీ మైదానం వరకు ఆయనను అనుసరిస్తారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, నగరపాలక సంస్థ మేయర్, పురపాలక సంఘాల ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరుతారు. హసన్‌పర్తి నుంచి భారీ ర్యాలీ.. కరీంనగర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30 గంటలకు హసన్పర్తికి వచ్చే కేటీఆర్‌కు అక్కడ భారీ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వందలాది వాహనాలతో వరంగల్ ఓ సిటీ సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హసన్‌పర్తి నుంచి భీమారం, కాకతీయ యూనివర్సిటీ, నయీంనగర్ పెట్రోల్‌పంపు, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ మీదుగా ఓ సిటీ మైదానం వరకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే వరంగల్ మహానగరం మొత్తం గులాబీమయమైంది. ప్రతి చౌరస్తాలో గులాబీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. రహదారులు, చౌరస్తాల్లో కేటీఆర్‌కు స్వాగత ఫ్లెక్సీలు నెలకొల్పారు. -
‘రామయ్యా’ వస్తాడయ్యా...!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్‌స్థాయి సన్నాహక సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే వరంగల్ ఓ సిటీ మై దానంలో వేదికను ఏర్పాటు చేశారు. గురువారం జరిగే వరంగల్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సభను విజయవంతం చేయాలని మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి దక్కగా.. ఆశావహ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించే సమావేశం కావడంతో అందరూ ఆ సభ సక్సెస్‌పై దృష్టి పెట్టారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా కార్యకర్తలను తరలించే పనిలో పార్టీ ఎమ్మెల్యేలు నిమగ్నం అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమావేశాలు... వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని నిత్య బాంకెట్ హాల్లో టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. 7న వరంగల్‌లో ని ఓ సిటీలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం సక్సెస్ కోసం భారీ గా కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపే ట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జిలు సమావేశాలు నిర్వహించారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచి ఐదువేల మంది కార్యకర్తలు, మిగతా నియోజకవర్గాల నుంచి మూడువేల మంది చొప్పున కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నాహక సభ పనులను పరిశీలించిన వారిలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి మేయర్ సిరాజుద్దీన్, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు ఋణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, చాంబర్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, టిఆర్ఎస్ నాయకులు మెట్టు శ్రీనివాస్, రాజనాల శ్రీహరి, వస్కుల బాబు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న కడియం, నాయకులు అన్ని ఎంపీ సీట్లు గెలవడమే ధ్యేయం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మం గళవారం వరంగల్ తూర్పు నియోజవర్గంలోని ఓ సిటీ మైదానంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయభాస్కర్లతో కలసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కేసీ ఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లు గెలవడమే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఎన్ని కల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోందన్నా రు. అందులో భాగంగానే ఈ నెల 7న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓ సిటీ మైదానంలో ఎన్నికల సన్నాహక సమావేశ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నందున ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల మందికి తగ్గకుండా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, రైతు సమన్వయ కమిటీల ప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిల ర్లు, జిల్లా, మండల, బూత్ కమిటీల నాయకులందరూ హాజరు కావాలన్నారు. రాష్ట్రంలోని మిత్రపక్షం ఎంఐఎంతో కలసి అన్ని పార్లమెంట్ స్థానాలను గెలుచుకొనే దిశగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నా యకులు పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ సభలో పాల్గొనే టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని ఎంపీ సీట్లు గెలవడమే ధ్యేయం -
కేటీఆర్ పర్యటనలో అపశృతి.. టీఆర్ఎస్ నేతకు గాయాలు
సాక్షి, హైదరాబాద్ : ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశృతి దొర్లింది. ఎల్బీనగర్ నియోజకర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ స్వల్పంగా గాయలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో పెద్ద ర్యాలీ జరిగింది. పర్యటనలో కేటీఆర్ కాన్వాయ్ ముందుకు వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ప్రయాణిస్తున్న వాహనం, ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్మోహన్ గౌడ్ చేతికి స్వల్పగాయం తగిలి రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. -
మంత్రి పర్యటన.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం
కరీంనగర్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలంలో మంత్రి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయను, ముస్తాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ పలువురు కార్యకర్తలు మండల కేంద్రంలో రాస్తారాకో నిర్వహించారు. -
13న గద్వాలలో కేటీఆర్ పర్యటన: మంద జగన్నాథం
మహబూబ్‌నగర్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌లు ఈనెల 13వ తేదీన జిల్లాలోని అలంపూర్, గద్వాలలో పర్యటించనున్నట్లు నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం తెలిపారు. సోమవారమిక్కడ కొండేరు గ్రామంలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌ను పట్టభద్రులు, ఉద్యోగ సంఘాల వారు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిప్రకాష్, నాయకులు గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (ఇటిక్యాల) -
27 నుంచి జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు
హైదరాబాద్: వాటర్ గ్రిడ్ పనుల పర్యవేక్షణ కోసం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను కేటీఆర్ విడుదల చేశారు. 27న మహబూబ్ నగర్ లో, 28న వరంగల్ లో, 29న ఖమ్మంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా..ఫిబ్రవరి 10 వ తేదీలోగా నల్గొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ పైలాన్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పైలాన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరిస్తారన్నారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ పథకంపై కేటీఆర్ సమీక్షలు నిర్వహించనున్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, జిల్లాల అధికారులందరూ పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని కేటీఆర్ తెలియజేశారు.