మాట్లాడుతున్న కడియం శ్రీహరి, నాయకులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్‌స్థాయి సన్నాహక సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే వరంగల్ ఓ సిటీ మై దానంలో వేదికను ఏర్పాటు చేశారు. గురువారం జరిగే వరంగల్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సభను విజయవంతం చేయాలని మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి దక్కగా.. ఆశావహ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించే సమావేశం కావడంతో అందరూ ఆ సభ సక్సెస్‌పై దృష్టి పెట్టారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా కార్యకర్తలను తరలించే పనిలో పార్టీ ఎమ్మెల్యేలు నిమగ్నం అయ్యారు.
నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమావేశాలు...
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని నిత్య బాంకెట్ హాల్‌లో టీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. 7న వరంగల్‌లో ని ఓ సిటీలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం సక్సెస్ కోసం భారీ గా కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
కేటీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపే ట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్‌చార్జిలు సమావేశాలు నిర్వహించారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచి ఐదువేల మంది కార్యకర్తలు, మిగతా నియోజకవర్గాల నుంచి మూడువేల మంది చొప్పున కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సన్నాహక సభ పనులను పరిశీలించిన వారిలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జి మేయర్ సిరాజుద్దీన్, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు ఋణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, చాంబర్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, టిఆర్‌ఎస్ నాయకులు మెట్టు శ్రీనివాస్, రాజనాల శ్రీహరి, వస్కుల బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కడియం, నాయకులు
అన్ని ఎంపీ సీట్లు గెలవడమే ధ్యేయం
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మం గళవారం వరంగల్ తూర్పు నియోజవర్గంలోని ఓ సిటీ మైదానంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయభాస్కర్‌లతో కలసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కేసీ ఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లు గెలవడమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పార్టీ అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఎన్ని కల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోందన్నా రు.
అందులో భాగంగానే ఈ నెల 7న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓ సిటీ మైదానంలో ఎన్నికల సన్నాహక సమావేశ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నందున ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల మందికి తగ్గకుండా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, రైతు సమన్వయ కమిటీల ప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిల ర్లు, జిల్లా, మండల, బూత్ కమిటీల నాయకులందరూ హాజరు కావాలన్నారు.
రాష్ట్రంలోని మిత్రపక్షం ఎంఐఎంతో కలసి అన్ని పార్లమెంట్ స్థానాలను గెలుచుకొనే దిశగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నా యకులు పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ సభలో పాల్గొనే టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అన్ని ఎంపీ సీట్లు గెలవడమే ధ్యేయం
Comments
Please login to add a commentAdd a comment