సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు ఉదయం మేఘాలయ సీఎం సీకే సంగ్మాను కూడా కేటీఆర్ కలుసుకున్నారు. ఈ భేటీపై సీకే సంగ్మా సామాజిక మాధ్యమంలో.. ‘నా ప్రియమైన స్నేహితుడు కేటీ రామారావును కలుసుకోవడం గొప్పగా ఉంది’అంటూ పంచుకున్నారు. సంగ్మాతో చిన్న సమావేశమే అయినా అద్భుతంగా జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
కొత్త పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ‘సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీం’ను గురువారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గతంలో ఐఎస్‌బీలో జరిగిన సమావేశంలో పిజ్జా అవుట్ కార్యక్రమానికి హాజరవుతానని కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉప రాష్ట్రపతిని కలసిన మంత్రి కేటీఆర్
Published Thu, Nov 28 2019 2:24 AM | Last Updated on Thu, Nov 28 2019 2:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment