తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన హీరో నందమూరి బాలకృష్ణ . ఈ ఏడాదితో ఆయన నటుడిగా యాభైఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాన్ని సెప్టెంబరు 1న నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు కలిసి స్వర్ణోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు.
దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. 'బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ తర్వాత బాలకృష్ణలాగా నటించిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. బాలయ్య నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాదాలరవి, నటుడు శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వైవీఎస్ చౌదరి, సీ కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment