సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది.
బీజేపీ పోస్టర్‌లో ఏముంది?
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్‌ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్‌రూమ్, సీసీటీవీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్‌లైన్ పెట్టింది.
కేజ్రీవాల్ పుష్ప అవతార్
బీజేపీ పోస్టర్‌కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్‌లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్‌ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది.
Kejriwal Pushpa Style Poster: కేజ్రీవాల్ తలవంచడు..!
Published Mon, Dec 9 2024 6:03 AM | Last Updated on Mon, Dec 9 2024 9:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment