Former Delhi chief minister
-
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్‌ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్‌లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్‌కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్‌ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
Arvind Kejriwal: ఉచిత విద్యుతిస్తే బీజేపీకి ప్రచారం చేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానన్నారు. పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఆప్ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ‘‘వచ్చే ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75ఏళ్లు వస్తాయి. రిటైరవుతారు. ప్రధానిగా ఆయనకు మరో ఏడాది సమయమే ఉంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింట్లోనూవిద్యుత్తు ఉచితంగా ఇవ్వండి. బడులు, ఆసుపత్రులు బాగు చేయండి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తా’’ అన్నారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వమటే ‘డబుల్ దోపిడీ, నిరుద్యోగం, అధిక ధరలు’. హరియాణాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ దిగిపోనుంది. జార్ఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పోతాయి’’ అన్నారు. తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్ ఉందని కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్ర, ఆరోగ్య వసతులు, విద్య... ఇవే ఆ ఆరు స్వీట్లు’’ అని చెప్పారు. ఢిల్లీలో పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. -
'రేప్‌లు ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుబట్టారు. నగరంలో యువతులపై, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు. ఢిల్లీలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడిపట్ల ఆమె స్పందిస్తూ.. 'ముందుగా ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. బాలికలు, యువతులపై లైంగికదాడులు జరగడమనేది ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటే. ఇప్పుడు ఢిల్లీ పాలనకు సంబంధం లేని ప్రధాని నరేంద్రమోదీని ఈ ఘటనలపట్ల బాధ్యుడిగా చేసి మాట్లాడటం మరింత విచారకరం. కేజ్రీవాలే కాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా పోలీసు వ్యవస్థ వారి ఆధ్వర్యంలో ఉండనిదని తెలిసిన విషయమే. అందుకే, వెంటనే పోలీసు వ్యవస్థను ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి. వీవీఐపీలకు, రాయబారులకు ముందస్తు భద్రతకు, ఢిల్లీలో శాంతి భద్రతలకు ప్రత్యేక పోలీసు దళం తప్పక అవసరం' అని ఆమె చెప్పారు.