కామ్రేడ్‌ భారతక్క ఎంతో కీలకం: రానా దగ్గుబాటి | Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster | Sakshi
Sakshi News home page

Priyamani Birthday: ప్రియమణికి రానా దగ్గుబాటి బర్త్‌డే విషెస్‌..

Published Sat, Jun 4 2022 11:11 AM | Last Updated on Sat, Jun 4 2022 12:26 PM

Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster - Sakshi

Happy Birthday Priyamani: Rana Shares Virata Parvam Poster: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం జూన్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అలాగే కామ్రేడ్‌ భారతక్క పాత్రలో ప్రియమణి అలరించనుంది. నేడు (జూన్‌ 3) పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ చెప్పాడు రానా దగ్గుబాటి. 

ఇంతకుముందు విడుదల చేసిన ప్రియమణి 'కామ్రేడ్ భారతక్క'గా నటిస్తున్న పోస్టర్‌ను పంచుకుంటూ ట్వీట్‌ చేశాడు రానా. ఈ ట్వీట్‌లో 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్‌ రెవల్యూషన్‌లో స్టూడెంట్స్‌ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రెడ్‌ భారతక్క కూడా అంతే కీలకం.' అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగాదారిలో పాటను రిలీజ్‌ చేశారు. సురేశ్‌ బొబ్బిలి సంగీత సారథ్యంలో ఫోక్‌ సింగర్‌ వరం ఆలపించిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నరేందర్‌ రెడ్డి, సనపతి భరద్వాజ్‌ పాత్రుడు లిరిక్స్‌ అందించారు. 

చదవండి: కేసీఆర్‌ బయోపిక్‌పై ఆలోచన ఉంది.. కానీ: రామ్‌ గోపాల్‌ వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement