
న్యూఢిల్లీ : దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలను చేపడుతున్నారు. ఈ మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు, అత్యవవసర సిబ్బందికి ప్రోత్సాహం అందించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ నాడు చప్పట్లు కొట్టమని పిలుపునిచ్చారు. దీంతో భారతావని ఒక్కతాటిపైకి వచ్చి దాన్ని తమ విధిగా నిర్వర్తించింది. అనంతరం దేశ సమైక్యతను చాటి చెప్పేందుకు ఏప్రిల్ 5న జ్యోతిని వెలిగించాలని కోరగా దాన్ని కూడా ప్రజలు దిగ్విజయం చేశారు. అంతేకాక లాక్‌డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలను తన హోదాను పక్కనపెట్టి మరీ క్షమాపణలు కోరారు.
ఈ నేపథ్యంలో మనకోసం ఎంతో కష్టపడుతున్న నరేంద్ర మోదీకి వందనం చేద్దాం.. అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన కోసం, మన దేశం కోసం ఎంతో కృషి చేస్తున్న మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు ఇంట్లోనే నిల్చుని సెల్యూట్ చేద్దాం అన్నదే ఈ పోస్ట్ సారాంశం. దీనిపై మోదీ స్పందిస్తూ.. "నా కోసం 5 నిమిషాలు నిలబడండి అని చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. అయితే తొలుత నన్ను వివాదంలోకి లాగడానికి అల్లరి మూకలు చేసిన పనిగా భావించాను. కానీ నిజంగా నాపై మీకు ప్రేమ, గౌరవం ఉన్నట్లైతే ఓ పని చేసి పెట్టాలి. కరోనా సంక్షోభం ముగిసేవరకు ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి" అని కోరారు. దీంతో మరోసారి మోదీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment