బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా నిలిచిన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒకరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి.
ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే..
Comments
Please login to add a commentAdd a comment