Coal India Limited
-
కోల్ ఇండియాలో 16న సమ్మె సైరన్
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా నిలిచిన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒకరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
నేటి నుంచి బొగ్గు కార్మికుల సమ్మె!
న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్) కార్మికులు మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు సమ్మె బాట పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి మంగళవారంనాడు ప్రభుత్వం ఒక సమావేశాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కార్మికులు సమ్మెను ప్రారంభిస్తున్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ కార్మిక సంస్థలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. బొగ్గు రంగం ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, కోల్ ఇండియా పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను నిరసిస్తూ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ప్రతిపాదిత సమ్మె వల్ల విద్యుత్ సంస్థల ఉత్పత్తికి ఎటువంటి విఘాతం రాకుండా, సరఫరాలను పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా బొగ్గు కార్మికుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు విద్యుత్ కార్మికుల సంఘం ఈఈఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్ ఇండియా సీఎండీగా భట్టాచార్య బాధ్యతలు... కోల్ ఇండియా పూర్తి స్థాయి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా సుతీర్థ భట్టాచార్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతక్రితం భట్టాచార్య సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వంలో చేరేందుకు 2014 మే నెలలో ఎస్.నరసింగరావు రాజీనామా చేసిన నాటి నుంచి, ఈ సంస్థ అత్యున్నత స్థాయి పదవి ఖాళీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం సీఐఎల్ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 482 మిలియన్ టన్నులు (ఎంటీ). అయితే 462 ఎంటీలు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. 2019 నాటికి బిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్య సాధన లక్ష్యం. లక్ష్యాలను సాధించడమే కొత్త సీఎండీ ముందున్న ప్రధాన సవాలని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
కోల్ ఇండియాలో 5% వాటా విక్రయానికి రెడీ
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 5% వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఆఫర్ ఫర్ సేల్‌ను చేపట్టనున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ తెలిపింది. దీంతో 5% వాటాకు సమానమైన 31.58 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 8,500 కోట్లవరకూ లభించే అవకాశముంది. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 90% వాటా ఉంది. బీఎస్ఈలో గురువారం షేరు ధర 2% లాభపడి రూ. 268 వద్ద ముగిసింది. ఇష్యూ నిర్వహణకు ఎంపిక చేసిన మర్చంట్ బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం ఈ నెల 26న బిడ్స్‌ను ఆహ్వానించనుంది. దీనిలో భాగంగా కంపెనీ ఉద్యోగులకు ఆఫర్ ధరలో 5% డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇష్యూలో 10% షేర్లను ఇందుకు కేటాయించనున్నారు. కాగా, నిజానికి తొలుత 10% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గింది. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి మూడు రోజుల సమ్మెను చేపట్టనున్నట్లు ట్రేడ్ యూనియన్ నోటీసును జారీ చేసింది. 2010లో తొలిసారి 10% వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం కోల్ ఇండియా షేర్లను ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేసింది.