రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాలా చారి అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాలా చారి అన్నారు. కోల్ ఇండియా సమస్యలు వేరు, సింగరేణి సమస్యలు వేరని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. సంబంధం లేని కారణాలతో సింగరేణి కార్మికులు సమ్మె చేయడం తగదన్నారు. విద్యుత్ సంక్షోభ సమయంలో సింగరేణి కార్మికుల సమ్మె తగదని వేణుగోపాలాచారి వ్యాఖ్యానించారు. వెంటనే సింగరేణి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన కోరారు.