గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment