ఇప్పుడు ఎవరి నోటా విన్న ఒకటే మాట ఏఐ. అదేనండీ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్. ఇటీవలే యాంకరమ్మను కూడా పరిచయం చేశారు కదా. తాజాగా ఈ సెగ హాలీవుడ్‌కు తాకింది. ఏఐ వచ్చి హాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ భవిష్యత్తు భరోసా ఇవ్వాలంటూ హాలీవుడ్‌కు చెందిన ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఏఐ నుంచి తమను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరింత ఆలస్యంగా విడుదల కానున్నాయి.
(ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్ )
నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపు 1,60,000 మంది నటీనటులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా కూడా సమ్మెకు దిగింది. తాజాగా నటీనటులు ధర్నాకు దిగడంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మూతపడింది. చివరిసారిగా 1980లో నటీనటుల సంఘం చేపట్టిన సమ్మె మూడు నెలలకు పైగా కొనసాగింది. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే భారీ సినిమాలు సైతం రిలీజ్ వాయిదా పడనున్నాయి.
(ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!)
Comments
Please login to add a commentAdd a comment