సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఉపకార వేతనాలు చెల్లించి.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదురోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుపున ఎలాంటి స్పందన రాకపోవడంతో జూడాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఈ తరుణంలో రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చలించకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ సేవల్ని బహిష్కరించి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. జూడాల నిర్ణయంతో పలు ఆస్పత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించిన తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో వైపు వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉపకార వేతనాల పెంపు, ఆస్పత్రులలో అసౌకర్యాలు, పలు సందర్భాలలో వైద్యులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా 4వేలకు మందికి పైగా జూనియర్ డాక్టర్లు నిరవదిక సమ్మెను కొనసాగిస్తున్నారు.
ఈ తరుణంలో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహంతో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ పలు అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో జూడాలు తమ సమ్మెను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment