judas strick
-
టీజీలో కొనసాగుతున్న జూడాల సమ్మె..రోగుల ఇక్కట్లు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఉపకార వేతనాలు చెల్లించి.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదురోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుపున ఎలాంటి స్పందన రాకపోవడంతో జూడాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చలించకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ సేవల్ని బహిష్కరించి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. జూడాల నిర్ణయంతో పలు ఆస్పత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించిన తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.మరో వైపు వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉపకార వేతనాల పెంపు, ఆస్పత్రులలో అసౌకర్యాలు, పలు సందర్భాలలో వైద్యులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా 4వేలకు మందికి పైగా జూనియర్ డాక్టర్లు నిరవదిక సమ్మెను కొనసాగిస్తున్నారు.ఈ తరుణంలో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహంతో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ పలు అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో జూడాలు తమ సమ్మెను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
‘ఉద్యమిస్తాం.. ఆమరణ దీక్షకు దిగుతాం’
సాక్షి, తిరుపతి: ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని రుయా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం రుయా అధికారులతో జూడాల చర్చలు విఫలమాయ్యాయి. దీంతో అత్యవసర సేవలను సైతం జూడాలు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధర్మపోరాట దీక్షలంటూ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. దీక్షల పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. దుర్వినియోగం చేస్తున్న నిధులలో పదిశాతం జూడాలకు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. అయితే జూడాల తీరును రుయా అధికారులు తప్పుపట్టారు. -
జూడాలతో డీఎంఈ చర్చలు విఫలం
కొనసాగుతున్న సమ్మె సాక్షి, విజయవాడ బ్యూరో: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ఏపీ వైద్య విద్య డెరైక్టర్ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్ సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒక ఏడాది గ్రామీణ సర్వీసు తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జూడాలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకటేశ్ సిద్ధార్థ వైద్య కళాశాల ఆడిటోరియంలో జూడాలతో సమావేశమయ్యారు. చర్చలు ముగిసిన తర్వాత డీఎంఈ విలేకరులతో మాట్లాడారు. సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉందని, తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని జూడాలను కోరినట్లు చెప్పారు. జూడాలు కోరుతున్నట్లుగా వాలంటరీ సర్వీసుకు అవకాశం కల్పిస్తే ఒంగోలు, శ్రీకాకుళం వంటి కాలేజీలకు వెళ్లరని, తద్వారా అక్కడి ఆస్పత్రుల్లో ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు కార్తీక్, క్రాంతికుమార్ విలేకరులకు తెలిపారు. మరోవైపు విజయవాడ సిద్ధార్థ, కాకినాడ రంగరాయ, కర్నూలు, తిరుపతి వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో జూడాలు విధుల బహిష్కరణను కొనసాగించారు. విజయవాడ సిద్ధార్థ, తిరుపతి రుయా ఆస్పత్రుల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. -
రుయాలో మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
తిరుపతి: తిరుపతి రుయాలో జూనియర్ డాక్టర్లు సమ్మెను ఉధృతం చేశారు. తక్షణమే జీవో 78ను రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేశారు. దాంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ రుయాలో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు మొండిగా వ్యవహరించటం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకూ సమ్మె కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. మరోవైపు వైద్య సేవలు నిలిచిపోవటంతో ఐదుగురు రోగుల పరిస్థితి విషమంగా ఉంది.