సాక్షి, తిరుపతి: ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని రుయా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం రుయా అధికారులతో జూడాల చర్చలు విఫలమాయ్యాయి. దీంతో అత్యవసర సేవలను సైతం జూడాలు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ధర్మపోరాట దీక్షలంటూ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. దీక్షల పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. దుర్వినియోగం చేస్తున్న నిధులలో పదిశాతం జూడాలకు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. అయితే జూడాల తీరును రుయా అధికారులు తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment