'చిల్లిగవ్వ లేదు.. నా ప్రాణాలు కాపాడండి' | woman patient troubles in tirupathi ruia hospital | Sakshi
Sakshi News home page

'చిల్లిగవ్వ లేదు.. నా ప్రాణాలు కాపాడండి'

Published Sat, Dec 12 2015 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

woman patient troubles in tirupathi ruia hospital

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు రోగులకు నరకాన్ని చూపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఉదయం 7గంటలకు వైద్యం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళ స్థానిక రుయా ఆస్పత్రికి వచ్చింది. అయితే, కేవలం ఓ మందు బిల్ల ఇచ్చి డాక్టర్లు చేతులు దులుపుకున్నారంటూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది. వైద్యం చేయడం లేదంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద చిల్లిగవ్వ లేదని, తన ప్రాణాలు కాపాడాలంటూ బాధిత మహిళ వేడుకోవడం చూపరులను సైతం కంటతడి పెట్టించక మానదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement