woman patient
-
తలనొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళితే..
సాక్షి, హైదరాబాద్ : తలనొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడో కీచక వైద్యుడు. నొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ బస్తీకి చెందిన ఓ మహిళకి తలనొప్పి రావడంతో స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానాకు వెళ్లారు. తలనొప్పి, దగ్గు తరచూ వస్తుందని పరీక్షలు చేయమని వైద్యుడు బాలరాజును సంప్రదించారు. నొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలంటూ ఆస్పత్రిలోని ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
'చిల్లిగవ్వ లేదు.. నా ప్రాణాలు కాపాడండి'
-
'చిల్లిగవ్వ లేదు.. నా ప్రాణాలు కాపాడండి'
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు రోగులకు నరకాన్ని చూపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఉదయం 7గంటలకు వైద్యం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళ స్థానిక రుయా ఆస్పత్రికి వచ్చింది. అయితే, కేవలం ఓ మందు బిల్ల ఇచ్చి డాక్టర్లు చేతులు దులుపుకున్నారంటూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది. వైద్యం చేయడం లేదంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద చిల్లిగవ్వ లేదని, తన ప్రాణాలు కాపాడాలంటూ బాధిత మహిళ వేడుకోవడం చూపరులను సైతం కంటతడి పెట్టించక మానదు. -
అంబులెన్స్‌లో తీసుకెళ్లి నది పక్కన పడేశారు
కాన్పూర్: వైద్యం కోసం వచ్చిన ఓ మహిళా రోగికి చికిత్స అందించపోగా ఆమె పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఇద్దరు వైద్యులపై వేటు పడింది. ఆమెను గంగా నది వంతెనపై పడేసి వచ్చినందుకు ఆ వైద్యులను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కృష్ణ దేవీ అనే మహిళ గతవారం రైలు ప్రమాదానికి గురై గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స కోసం చేరింది. అయితే, అందులోని వివేక్ నాయర్, ఇఫ్తికార్ అన్సారీ అనే జూనియర్ డాక్టర్లు ఆమెను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో తీసుకెళ్లి గంగా నది బ్యారేజ్ వద్ద పడేసి వచ్చారు. ఆమెను తెల్లవారాక పోలీసులు గుర్తించి వివరాలు తెలుసుకోగా జరిగిన ఘటన మొత్తం చెప్పింది. దీంతో ఆమెను తిరిగి అదే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీనియర్ వైద్యులు జూనియర్ డాక్టర్లను తీవ్రంగా మందలించారు. ఘటనపై ముగ్గురు వైద్యులతో విచారణ ప్రారంభించి వారిపై మూడు నెలల సస్పెన్షన్ వేటు వేశారు.