రుయాలో మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత | Ruia hospital junior doctors protest against GO no 78 | Sakshi
Sakshi News home page

రుయాలో మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత

Published Tue, Aug 19 2014 11:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

Ruia hospital junior doctors protest against GO no 78

తిరుపతి: తిరుపతి రుయాలో జూనియర్ డాక్టర్లు సమ్మెను ఉధృతం చేశారు. తక్షణమే జీవో 78ను రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేశారు. దాంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

 

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ రుయాలో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు మొండిగా వ్యవహరించటం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకూ సమ్మె కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. మరోవైపు వైద్య సేవలు నిలిచిపోవటంతో ఐదుగురు రోగుల పరిస్థితి విషమంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement