రుయాలో మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
తిరుపతి: తిరుపతి రుయాలో జూనియర్ డాక్టర్లు సమ్మెను ఉధృతం చేశారు. తక్షణమే జీవో 78ను రద్దు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేశారు. దాంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ రుయాలో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు మొండిగా వ్యవహరించటం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకూ సమ్మె కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. మరోవైపు వైద్య సేవలు నిలిచిపోవటంతో ఐదుగురు రోగుల పరిస్థితి విషమంగా ఉంది.