శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం చరిత్రలో ఇది అతిపెద్ద వ్యవస్థీకృత కార్మిక చర్య. వేతన పెంపు, సెలవుల విషయంలో గత నెలలో చర్చలు విఫలం కావడంతో కంపెనీలోని అతిపెద్ద యూనియన్ గత కొన్ని వారాలుగా మూడు రోజుల వాకౌట్ కు సిద్ధమవుతోంది.
శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గత జూన్ ఆరంభంలో ఒక్క రోజు సమ్మె జరిగింది. తాజాగా జూలై 8న భారీ సమ్మెను కార్మికులు చేపట్టారు. కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి సందేశాన్ని పంపడానికి దీన్ని ఉద్దేశించినట్లుగా యూనియన్ నాయకులు చెబుతున్నారు.
సియోల్ కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్ లోని శాంసంగ్ సెమీకండక్టర్ ప్లాంట్‌ల వెలుపల సోమవారం ఉదయం 11 గంటలకు ర్యాలీలకు 5,000 మందిని సమీకరించాలని కార్మిక సంఘం లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ బ్లూమ్ బర్గ్ న్యూస్ కు తెలిపారు. వాస్తవానికి ఎంత మంది కార్మికులు విధులను పక్కన పెడతారో స్పష్టంగా తెలియదు. ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ వాకౌట్ లక్ష్యమని యూనియన్ నేత సన్ వూ మోక్ తెలిపారు.
3% వార్షిక మూలవేతనం పెంపునకు అంగీకరించని సుమారు 855 మంది సిబ్బందికి పెద్ద వేతన పెంపును కోరుతున్నట్లు మొదట చెప్పిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను మార్చారు. ఇప్పడు మొత్తం 28,000 మందికి పైగా యూనియన్ సభ్యులకు అధిక వేతనాలు, అదనపు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సెమీకండక్టర్ సిబ్బందికి ప్రథమార్ధం పనితీరు సంబంధిత బోనస్ లను ప్రకటించడం ద్వారా కార్మికుల సమ్మె ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి శాంసంగ్ ప్రయత్నించింది. కాని వారు వాగ్దానం చేసిన నెలవారీ జీతాలలో గరిష్టంగా 75% గతంలో సాధారణమైన పూర్తి నెల చెల్లింపు కంటే తక్కువగా ఉంది.
కొరియాలోని అనేక ప్రముఖ కంపెనీలను పీడిస్తున్న గ్రౌండ్ అప్ కల్లోలాన్ని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో నివారించింది. శాంసంగ్ దివంగత చైర్మన్, ప్రస్తుత అధినేత జే వై లీ తండ్రి లీ కున్ హీ యూనియన్లు ఏర్పడకుండా నిరోధించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పుడు నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అనేది సుమారు 28,000 మందికి పైగా కార్మికులతో కంపెనీ యూనియన్లలో కెల్లా అతి పెద్దది.
Comments
Please login to add a commentAdd a comment