దళిత సీఎం హామీ ఏమైంది?: జైపాల్ రెడ్డి
Published Tue, Apr 12 2016 4:38 PM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM
సికింద్రాబాద్ : నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదు, దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్, జైపాల్‌రెడ్డితోపాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతలు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... సామాజిక సిద్ధాంతాన్ని స్వీకరించనివారికి అంబేద్కర్ పేరు పలిక అర్హత లేదన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలను ఏబీవీపీ అడ్డాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కాగా, అంబేద్కర్‌పై ముఖ్యమంత్రిది బూటకపు ప్రేమగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి మోసం చేశారని ఆరోపించారు.
Advertisement