'మోదీతో స్నేహం..అమిత్‌షాతో శతృత్వమా?'
హైదరాబాద్: కాకి లెక్కలు చెప్పడంలో అమిత్‌షా సిద్ధహస్తుడు. గతంలో చాలా చోట్ల ఇలాంటి కాకిలెక్కలు చెప్పారు. ఆయన మాటల వల్ల రాష్ట్రానికి చేకూరిన లబ్ది శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ద్వంద వైఖరి ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతోందన్నారు. మోదీతో స్నేహం చేస్తూ.. అమిత్‌షాతో శతృత్వమా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు చిత్త శుద్ధి ఉంటే విపక్షాలు ఎంచుకున్న రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించాలన్నారు. కేసీఆర్ సిద్ధాంత వాది కాదు. రాద్ధాంత వాదని.. భవిష్యత్తులో టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ అసలు రంగు బయటపడిందని, టీఆర్‌ఎస్ సర్కార్‌లో జరుగుతున్నఅవినీతి లెక్కలు మోదీ దగ్గర ఉన్నాయన్నారు. అందుకే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో కలిసిపోయే టీఆర్‌ఎస్, బీజేపీలను కాంగ్రెస్ ఎందుర్కొంటుందని ఆయన అన్నారు.