
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని న్యాయ కళాశాల ఎదుట బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. దీనిపై గురువారం ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ, ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఏర్పాటు చేయడాన్ని అధికారులు తప్పుపట్టినట్లు తెలిపారు. దీనిపై విచారణ కమిటీని నియమించినట్లు చెప్పారు.
‘నేనే ఆవిష్కరించాను..’
ఓయూ న్యాయ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తానే ఆవిష్కరించినట్లు బషీర్‌బాగ్ పీజీ న్యాయ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు ఐదేళ్లుగా కళాశాల ఎదుట అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు న్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఓయూలో ఈ నెల 14న అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూను స్థాపించిన 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఆయన విగ్రహాన్ని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేయాలని, అంబేడ్కర్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధ్యాయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment