దళితులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు మాటలకు నిరసనగా బుచ్చిరెడ్డిపాళెం ....
నిరసన దీక్ష నేడు బుచ్చిరెడ్డిపాళెం : దళితులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు మాటలకు నిరసనగా బుచ్చిరెడ్డిపాళెం అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 9 గంటలకు నిరసన దీక్ష జరగనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొంటారని వారు తెలిపారు.