
ఐక్యతతోనే మాలల అభివృద్ధి
అనంతపురం న్యూటౌన్ : ఐక్యతతో హక్కులను సాధించుకున్నప్పుడే మాలల అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ మేవా అధ్యక్షుడు ఎస్టీ శ్రీనివాసు లు పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భం గా రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సం ఘం (ఏపీ మేవా) మాల మహానాడు సంయుక్త ఆధ్వర్వంలో గురువారం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఫంక్షన్ హాలులో మాలల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా విచ్చేసిన మాల ఉద్యోగులు ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా విచ్చేసినరాష్ట్ర అధ్యక్షుడు శ్రీని వాసులు, రాష్ట్ర కార్యదర్శి పెన్నోబిలేసు, బీజేపీ దళి త మోర్చా రాష్ర్ట సభ్యుడు తలమర్ల శ్యాంసుందర్, సామాజిక సేవా కార్యకర్త దాసరి ఆదినారాయణ, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబు తదితరులు మాట్లాడారు. మాల విద్యార్థులకు సకాలంలో స్కాలర్ షిప్పులు విడుదల చేయాలని, ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీలకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీసీ కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సురేష్‌బాబు, రామన్న, కటిక జయరామ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.