దేశానికే తలమానికం | An Ambedkar statue of the state government was created by the head of the country | Sakshi
Sakshi News home page

దేశానికే తలమానికం

Published Sat, Aug 19 2017 4:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

దేశానికే తలమానికం - Sakshi

దేశానికే తలమానికం

అంబేడ్కర్‌ విగ్రహ స్థాపనపై మంత్రి జగదీశ్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అంబేడ్కర్‌ విగ్రహ స్థాపన దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దా లని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహ స్థాపన తెలంగాణకి ఓ రోల్‌ మోడల్‌ కావాలని ఆయన ఆకాంక్షిం చారు. శుక్రవారం సచివాలయంలో జగదీశ్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన విగ్రహ కమిటీ సభ్యులు డిజేయిన్‌ స్టూడియో ప్రతినిధులు రూపొందించిన నమూనాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలించారు.

నమూనా లో కొన్ని మార్పులు చేయడంతో పాటు అంతిమంగా ఎలా ఉండాలి, ఎంత స్థలంలో నిర్మిం చాలి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అభివృద్ధి చైర్మన్‌ మల్లె్లపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌ కుమార్, వేముల వీరేశం, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతి రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ కరుణాకర్, జేఎన్టీయూ శిల్పి శ్రీనివాస రెడ్డి లతో పాటు ఢిల్లీకి చెందిన డిజేయిన్‌ స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement