అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘననివాళి | YS Jaganmohan Reddy tributes to Ambedkar in party office | Sakshi
Sakshi News home page

అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘననివాళి

Published Thu, Apr 14 2016 10:39 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘననివాళి - Sakshi

అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘననివాళి

రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.

వైఎస్ జగన్ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులకు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తిని అందరం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు కొద్దిగా అటూ ఇటూగా ట్రాన్స్ లేట్ చేస్తూ 'ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం. ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం' అన్న మాటలు చెప్పుకోవాల్సి ఉందన్నారు. అంబేదర్క్ స్ఫూర్తిని పాలకులు మర్చిపోవటం బాధాకరమన్నారు. రాజ్యాంగాన్ని రచించటమే అంబేద్కర్ గొప్పదనమన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నదే ఆయన రాసిన రాజ్యాంగంలో ఉందన్నారు. అయితే అది అమలు జరగటం లేదన్నారు.

ఈ సందర్భంగా నేతలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. జీవితం గొప్పగా ఉండాలి తప్ప ఎక్కువ కాలం కాదన్న అంబేద్కర్ స్ఫూర్తిని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఆయన 125వ జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement