అంబేడ్కర్‌ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్‌ | Minister Nara Lokesh mistake on Ambedkar Jayanthi | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్‌

Published Sat, Apr 15 2017 1:45 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

అంబేడ్కర్‌ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్‌ - Sakshi

అంబేడ్కర్‌ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్‌

వర్ధంతి సందర్భంగా అంటూ శుభాకాంక్షలు చెప్పిన వైనం

భవానీపురం (విజయవాడ పశ్చిమం) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తప్పుగా ప్రసంగించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అన్నారు.

ఆడిటోరియంలో ఉన్నవారు వర్ధంతి కాదు.. జయంతి అని అరవడంతో ఆయన నాలుక్కరుచుకుని.. సారీ.. జయంతి అని సరిదిద్దుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో కూడా లోకేశ్‌.. శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారని సభికులు గుర్తు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement