Minister Nara Lokesh
-
నిరసనల వెల్లువ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు... కవిటి మండల కేంద్రంతో పాటు కవిటి మండలంలోని జగతి గ్రామంలోనూ మహిళలు ఖాళీ బిందెలతో ఆయన కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లి నిరసన తెలిపారు. తమకు తాగునీరు అత్యవసరంగా సరఫరా చేయాలని మొరపెట్టుకున్నారు. గుక్కెడు నీరు పోసేవారే కనిపించట్లేదని, ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కంచిలి మండలం తలతంపర గ్రామంలోనూ తమకు తాగునీరు అందలేదని మొరపెట్టుకున్నారు. మంత్రి నారా లోకేష్... రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయనకు కూడా ఉద్దానంలో నిరసనలు తప్పలేదు. మందస సమీపంలోని రత్తి జంక్షన్ వద్ద వరద బాధితులు అడ్డుకున్నారు. నాలుగు రోజులుగా తమ ఆకలికేకలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. టీడీపీ నేత పీరుకట్ల విఠల్... పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ కారులో ప్రయాణిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌కు ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. కారులో ఉన్నది శివాజీ అనుకున్న మందస మండలం హరిపురం గ్రామస్థులు అడ్డుకున్నారు. కారును చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. తమకు తాగునీరు సహా కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టరు శైలజ... వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఆమెను ఎల్ఎన్ పేట మండలంలోని మిరియాపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తిత్లీ తుపానుతో వంశధార నది వరద తమ గ్రామాన్ని దిగ్బంధించి మూడ్రోజులైనా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్క అధికారి కూడా అడుగుపెట్టలేదని, ఇప్పుడెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమె కారుకు అడ్డంగా బైఠాయించారు. ఈ ఉదాహరణలు మాత్రమే. ఇవి తిత్లీ తుపాను బాధిత ప్రాంతాలు, వంశధార వరద ముంపు గ్రామాల్లో ప్రజల ఆక్ర కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. తమకు తాగునీరు, కరెంటు సహా కనీస సౌకర్యాలు కల్పించాలంటూ గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసర సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నామని, తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టట్లేదని ఆక్రోషిశిస్తున్నారు. సమస్యలు తీరే వరకూ ఇక్కడే ఉంటానని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించినా ఆయన హామీలేవీ ఆచరణలో కనిపించట్లేదు. ఇప్పటికీ 90 శాతం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరగలేదు. తాగునీటి సరఫరాలో ప్రత్యామ్నాయ చర్యలే కనిపించట్లేదు. సీఎం సహా రాష్ట్ర అధికార యంత్రాంగమంతా ఉద్ధానంలోనే మకాం వేసినా ఫలితం మాత్రం కనిపించట్లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. టీడీపీ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ అడ్డగించి తమ నిరసనలు తెలుపుతున్నారు. తాగునీటికి కటకట... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజల ప్రధాన సమస్యలు తాగునీరు, కరెంట్ మాత్రమే. ఈ రెండూ మెరుగుపడితే మిగతా సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని ప్రజలే భావిస్తున్నారు. తుపాను బాధితులకు పునరావాసం, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రే శ్రీకాకుళం చేరుకున్నారు. తర్వాత రెండ్రోజులుగా పలాసలో మకాం వేశారు. ఉద్దానంలో కొన్ని మార్గాల్లో భారీ కాన్వాయ్‌తో పర్యటించారు. ఏరియల్ సర్వే కూడా నిర్వహంచారు. కానీ సమస్యలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు. శనివారం నాటికి కనీసం విద్యుత్తు పునరుద్ధరణ జరిగిన గ్రామాలు 30 శాతం మించలేదు. విద్యుత్తు అంతరాయంతో తాగునీటి ప్రాజెక్టులు కూడా పనిచేయట్లేదు. బావులు, చెరువులు వరద కారణంగా కలుషితమైపోయాయి. దీంతో తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు అంతంతమాత్రమే. అధికార యంత్రాంగం మోహరించినా... సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ట్రైనీ ఐఏఎస్‌లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సహా రాష్ట్ర యంత్రాంగం అంతా ఉద్దానంలో కొలువుదీరింది. 38 మంది ఐఏఎస్ అధికారులకు ఒక్కో మండలం చొప్పున అప్పగించారు. ఆ మండలంలో అన్ని వసతుల పునరుద్ధరణ బాధ్యత వారిదే. కానీ వారికి ప్రోటోకాల్ బాధ్యతలు చూసేందుకు రెవెన్యూ యంత్రాంగం అవస్థ పడుతోంది. క్షేత్రస్థాయిలో వారు అందించాల్సిన సేవలను పక్కనబెట్టి ఉన్నతాధికారులు, టీడీపీ నాయకుల ప్రోటోకాల్ సేవలకే పరిమితమవుతున్నారు. ఇక చంద్రబాబుతో పాటు జిల్లా కలెక్టరు సహా అన్ని శాఖల అధికారులు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారు తాము చేయాల్సిన పనులపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఉద్ధానంలో గ్రామాలు వాహనాల శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి. ఒక్క అధికారుల కోసమే సుమారు 220 కార్లను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారులకు ఉన్న కార్లకు ఇవి అదనం. సీఎం కాన్వాయ్‌లో అయితే ఏకంగా 28 వరకూ కార్లు ఉంటున్నాయి. ఇక తాను పర్యటనకు వచ్చినప్పుడు కవిటి ఎంపీడీవో అందుబాటులో లేడనే కారణంతో సీఎం చంద్రబాబు ఆయన్ను సస్పెండ్ చేసినట్లు అక్కడికక్కడే ప్రకటించారు. -
సమస్యలపై లోకేష్‌ను నిలదీసిన గ్రామస్తులు
-
అభ్యర్థులను ప్రకటించడానికి లోకేశ్ ఎవరు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి నారా లోకేశ్ ఎవరని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం మైనార్టీ మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఎంపీ టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కర్నూలులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. లోకేశ్ టీడీపీ అధినేత కాదని, ముఖ్యమంత్రి కూడా కాదని, అలాంటప్పుడు అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ‘‘నా స్పందన ఒకటే ఉంటుంది. లోకేశ్ మంత్రి. ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు. ముఖ్యమంత్రి కూడా కాదు. కర్నూలు జిల్లాకు ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం నిజంగా నాకు అంతుబట్టడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా పొద్దున బీ ఫారం ఇచ్చే ముందు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే చేసిన తర్వాత ముందుకు పోతామని చంద్రబాబు నాతో చాలాసార్లు చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు. దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. మరి ఆయన(లోకేశ్) ఎందుకు ఆ విధంగా స్పందించారో నాకు తెలియదు. ఎస్వీ మోహన్‌రెడ్డి హిప్నాటైజ్ చేశారేమో లోకేశ్‌ను. మా మోహన్‌రెడ్డి ఏమైనా చేయగలరు. ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించి.. వీళ్లకు ఓట్లు వేయండని అడగటం నాకు నిజంగా ఇప్పటికీ అంతుబట్టడం లేదు. అద్భుతంగా ఉంది. లోకేశ్ కూడా అలా మాట్లాడరు. మా మోహనుడు హిప్నాటైజ్ చేసినట్టున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా’’ అని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. -
లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘సీఎం చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు రాజయోగం దక్కడం కోసం కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశాం అని సృజన్ కొన్ని రోజులుగా మాతో చెబుతున్నాడు. మేము పట్టించుకోలేదు. కానీ, ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని వెలుగులోకి రావడంతో అది నిజమేనని అర్థమైంది’’... ఇదీ సృజన్ సన్నిహితులు, బంధువులు ప్రస్తుతం చెబుతున్న మాట. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పూజలు చేశారని చెప్పిన సృజన్ ఆచూకీ కనిపించడం లేదు. నారా లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు చేశామని సృజన్ చెప్పడం... ఆ తరువాత అతడు కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వ్యూహం ప్రకారమే వారు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరీ సృజన్? గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివేరుకు చెందిన అర్చకుడు సృజన్. అక్కడ శివాలయంలో పనిచేస్తున్నాడు. ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 26న అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేసిన సమయంలో అతడు అక్కడే ఉన్నాడు. స్మార్త వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచాన్ని తొలగించి, మహిషాసురమర్థినిగా అలం కరణ చేసింది సృజనే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి అతని అచూకి లేదు. విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు నోరువిప్పడం లేదు. విజయవాడలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలో సృజన్‌ను ఉంచినట్లు తెలుస్తోంది. -
లోకేశ్ కోసం సీటు కావాలి !
-
నిధులు కావాలా.. మోదీనే అడగండి
ప్రజాప్రతినిధులతో లోకేశ్ అరసవల్లి (శ్రీకాకుళం): ‘ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేయాలని అడుగుతున్నారు.. ఎక్కడి నుంచి ఇవ్వాలి? నిధులు కావాలంటే ప్రధాని మోదీనే అడగండి.. పంచాయతీరాజ్‌లో మార్పులకు ప్రధానే కారణం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌కు ప్రత్యేక నిధులు ఇచ్చే అంశం పరిశీలించాలని శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి మంత్రి లోకేశ్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ విషయం ప్రధాని మోదీని అడగాలని, రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. -
సీఎం కొడుకు కదా.. కష్టాన్ని చెబితే..
♦ డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ♦ వైఎస్సార్ జిల్లాలో మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు ♦ మీరే బ్యాంకులకు కట్టొదన్నారు.. ఇప్పుడు వడ్డీ భారంగా మారింది ♦ కూలీనాలీ చేసి కట్టాల్సి వస్తోందని ఆవేదన.. దాటవేసిన లోకేశ్ ♦ మైదుకూరులో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన మంత్రి లోకేశ్ బుధవారం కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి అడుగుతూ వస్తున్న లోకేశ్‌కు డ్వాక్రా మహిళల రూపంలో చేదు అనుభవం ఎదురైంది. వల్లూరు మండలం తప్పెట్ల, పెద్దపుత్త గ్రామాల్లో మహిళలు.. డ్వాక్రా రుణాలు మాఫీ కాక వడ్డీ భారం పెరిగిందని.. భారంగా కడుతున్నామని, చివరకు వడ్డీలేని రుణాలూ అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. రుణ మాఫీ చేయకపోగా, రూ.10 వేల అప్పు నిధి సరిగా ఇవ్వలేదని నిలదీశారు. ఇప్పుడే అధికారులతో మాట్లాడుతానంటూ మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు మండలాల్లో మంత్రి లోకేశ్‌కు అగ్రిగోల్డ్ బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఖాజీపేటలో కాన్వాయ్‌ని అడుకోగా, మైదుకూరు నాలుగు రోడ్లు కూడలిలో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మాఫీ ఎప్పుడు చేస్తారు?: మంత్రి లోకేశ్ బుధవారం రాత్రి 7 గంటలకు మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చేరుకుని రోడ్డుపై ఉన్న పలువురిని పలుకరించారు. ఈ సందర్భంగా బీసీకాలనీకి చెందిన కొండమ్మ అనే మహిళ డ్వాక్రా రుణాలపై ప్రశ్నించారు. ‘మీరేమో మా అప్పు మాఫీ చేస్తామని ఇంతవరకు పట్టించుకోలేదు. బ్యాంకు సార్లు నెలనెల కడితేనే సరి..లేకపోతే నోటీసులు ఇచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నా మీరేమో పట్టించుకోలేదు. ఎన్నిరోజులు ఇలా అగచాట్లు పడాలో తెలియదు. మాఫీ అన్నారు.. ఏమి చేశారో తెలియ లేదు’ అని నిలదీయడంతో ఏం చేయాలో పాలుపోని లోకేశ్.. గ్రూపులో ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున ఇచ్చాం కదా అని సర్ధి చెప్పబోయారు. ‘అది కాదు.. నేను అడుగుతున్నది రుణ మాఫీ’ అని అమె మరోమారు రెట్టించి అడిగింది. సీఎం కొడుకు కదా.. కష్టాన్ని చెబితే మాఫీ చేస్తారని.. నా పేరు కొండమ్మ. మా ఆయన పేరు చిన్నహుస్సేన్. మాకు ఎకరా పొలం ఉంది. కూలి పనులు చేసుకుంటున్నాం. మా పెద్ద కుమారుడిని కువైట్‌కు పంపించాం. కొద్దిరోజులకు చనిపోయాడు. ప్రస్తుతం చిన్నకొడుకు బేల్దారి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2008 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నాం. 2013లో మదీన గ్రూపు పేరుతో రూ.2.50 లక్షలు అప్పు తీసుకున్నాం. తర్వాత 2015లో కూడా రూ.5 లక్షల రుణం ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో తెచ్చుకుని కంతులను చెల్లిస్తున్నాం. నెలకు రూ.1,500 చొప్పున గ్రూపులో ఒక్కొక్కరం కడుతున్నాం. డ్వాక్రా సొమ్మొంతా మాఫీ అవుతుందిలే అనుకున్నాం. ఇంతవరకు మాఫీ కాలేదు. పైగా నెలనెలా వడ్డీతో కలుపుకొని కంతులు కట్టడం కష్టంగా మారింది. సీఎం కొడుకు వస్తున్నాడని తెలియడంతో మా గోడును ఆయనకైనా చెబితే మాఫీ చేస్తారేమోనని ఇక్కడికి వచ్చాం. పెద్దోళ్లు కదా.. మాఫీ చేస్తారేమోనని ఆశతో అడిగాను. -
మంత్రి లోకేశ్ విస్మయం
అమరావతి: తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా విస్తరించిన బెల్టు షాపుల వల్ల మహిళలు పడుతోన్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేనప్పటికీ దాదాపు అన్ని పెద్ద గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతుండటం, ఆబ్కారీ శాఖ చూసిచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. తాజాగా తమ గ్రామంలోని బెల్టు షాపు వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న వైనాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహారావు అనే యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చాడు. బెల్టు షాపు ఫొటోను జతచేసి..‘అయ్యా.. మా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తోన్న ఈ బెల్టుషాపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా సార్లు ఫిర్యాదులు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని పౌరుడు పేర్కొన్నాడు. గ్రామీణాభివృద్ధి శాఖకు కూడా మంత్రిగా ఉన్న లోకేశ్.. ఆ ఫొటోను చూసి ‘ఏంటి! ఇది బెల్టు షాపా?’ అని విస్మయం వ్యక్తంచేశారు. ఆపై, ‘ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను అలర్ట్ చేస్తా’నని హామీ ఇచ్చారు. కానీ.. చివర్లో ‘ఒకవేళ ఆ(బెల్టు షాప్) సమస్య ఇంకా కొనసాగుతున్నట్లయితేనే చర్యలు తీసుకుంటాం’అని చిన్న మెలిక పెట్టారు మంత్రి లోకేశ్! అసలు బెల్టు షాపులే చట్టవిరుద్ధం. దానిని తక్షణమే మూసేయిస్తామని గట్టిగా చెప్పాల్సిందిపోయి.. ‘సమస్య ఉంటేనే చర్యలు తీసుకుంటా’మని మంత్రి అనడంపై స్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాటి ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం అమలుకాగా.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత నిషేధం ఎత్తేసిన సంగతి తెలిసిందే. (డెస్క్‌టాప్ నుంచి తీసిన స్క్రీన్ షాట్) -
‘సాక్షి’ చదివితే ప్రమాదం: లోకేశ్
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): సాక్షి పత్రికను చదివితే చాలా ప్రమాదమని ముఖ్యమంత్రి తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆ పత్రికలో ఏవేవో రాస్తారని అది ప్రమాదమని చెప్పారు. శనివారం విశాఖలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, ‘సాక్షి’పై విరుచుకుపడ్డారు. తాను మాత్రం పేపర్, చానల్‌ను పెట్టనని చెప్పారు. తన తాత, తండ్రిలా మంచి పేరు తెచ్చుకోలేకపోయినా, వారికి చెడ్డ పేరు మాత్రం తేబోనన్నారు. ప్రతిపక్ష నేతలు కుల, మతాలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేశ్..
-
విశాఖ టూర్లో చినబాబుకు చేదు అనుభవం
-
మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేశ్..
అమరావతి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే.. ప్రత్యర్థి పార్టీలపై, ఆయా నాయకులపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన ఘనత ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ సొంతం. సొంత రాష్ట్ర నేతలపైనేకాదు, పొరుగు రాష్ట్రానికి చెందిన మంత్రులపై సైతం లోకేశ్ పేల్చిన ట్వీట్లు.. కొన్నిసార్లు వివాదాస్పదం కావడం, ‘ట్విట్టర్లో తప్ప బయటికొచ్చి మాట్లాడలేడు..’ లాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం తెలిసిందే. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా ట్విట్టర్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లకు హాట్ టాపిక్‌గా మారింది. (డెస్క్‌టాప్ నుంచి తీసిన స్క్రీన్ షాట్) ‘అమరావతిలో మండలి చైర్మన్ చక్రపాణి గారిని కలుసుకోవడం సంతోషంగా ఉంది..’ అంటూ గురువారం రాత్రి నారా లోకేశ్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ స్టేటస్‌కు జత చేసిన ఫొటోలో అసలు చక్రపాణిగారు లేకపోవడంతో ట్విట్టరర్స్ అవాక్కయ్యారు. ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు..’, ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే. కాగా, కొద్దిసేపటికిగానీ సన్నిహితులు చెప్పడంతో తప్పు తెలుసుకున్న లోకేశ్.. పాత ట్వీట్‌ను తొలగించి సరైన ఫొటోతో మరో ట్వీట్ చేశారు. కొసమెరుపు: మూడు రోజుల కిందట వెలగపూడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్.. ప్రతిపక్షాలు తనను పప్పు అని ఒకసారి, అవినీతిపరుడని మరోసారి విమర్శిస్తున్నాయని, ఆ రెండింటిలో తాను ఏదో (పప్పా?, అవినీతిపరుడా?) తేల్చి చెప్పాలని అన్నారు. ఆయన పప్పా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే.. తప్పులు మాత్రం విధిగా, విరివిగా చేస్తున్నారని చెప్పక తప్పదు! చదవండి: నేను పప్పా.. అవినీతిపరుడినా! నారా లోకేశ్ ప్రమాణం చూశారా? మంత్రి లోకేశ్ మరోసారి అభాసుపాలు (మొబైల్ నుంచి తీసిన స్క్రీన్ షాట్) -
రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు
మేధా టవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేశ్ సాక్షి, అమరావతి: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయవాడలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఏడు ఐటీ కంపెనీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తయారీ రంగంతో పాటు టూరిజం వంటి అన్ని రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. కార్లలో ఇంటీరియర్స్ డిజైన్ చేసే గ్రూపో ఆంటోలిన్తో పాటు, మెస్లోవా, చందూ సాఫ్ట్, ఐఈఎస్, రోటోమేకర్, యామ్హై, ఈపీ సాఫ్ట్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, వీటి ద్వారా వచ్చే రెండేళ్లలో 1,600 ఉద్యోగాలు రానున్నాయని లోకేశ్ చెప్పారు. పాతదానికే కొత్త రంగు వేశాం కదా..:ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. మేధాటవర్స్ పేరుతో విజయవాడలో ప్రత్యేక ఆర్థికమండలిని ఏర్పాటు చేయించారు. ఇదే సెజ్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఉపయోగించుకుంటోంది. బుధవారం ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి వచ్చినప్పుడు లోకేశ్ దృష్టిలో పడేందుకు ఒక మీడియా ప్రతినిధి ‘సార్, మీరొచ్చాక దీనికొక కళ వచ్చింది..’ అని అనగా.. లోకేశ్ స్పందిస్తూ ‘పాతదానికే కొత్త రంగు వేశాం కదా’ అని సమాధానమివ్వడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. కాగావచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలిప్పిస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఏపీలో ఐటీ సర్వీసులు ప్రారంభించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘నిజమే.. జరగరానిది జరిగింది’
- ‘ఏర్పేడు’ మృతుల కుటుంబాలతో మంత్రి నారా లోకేశ్ - మునగలపాలెంలో బాధితులకు పరామర్శ - అంతా అయిపోయాక వచ్చారంటూ లోకేశ్‌ను నిలదీసిన మహిళ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘నిజమే.. జరగరానిది జరిగింది. ఘోరం జరిగిపోయింది. కారణాలేమైనా కావొచ్చు.. ఇకపై గ్రామాభివృద్ధి అవసరం. కలిసి కూర్చుందాం. అభివృద్ధిపై చర్చిద్దాం’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మునగలపాలెం రైతులకు సూచించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. శనివారం రాష్ట్ర మంత్రులు నారాయణ, అమరనాథ్‌రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాశ్లతో కలిసి మునగలపాలెంలో బాధిత కుటుంబాలను కలిశారు. చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మృతుల కుటుంబాలకు మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కులను అందజేశారు. దుర్ఘటనలో చనిపోయిన 12 మంది కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక దోపిడీని అరికట్టాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాననీ, ఇకపై అలాంటిదేమీ ఉండబోదని హామీ ఇచ్చారు. ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం?: ఈ సందర్భంగా గ్రామంలో శారద అనే మహిళ మంత్రి లోకేశ్‌ను మీడియా ముందే నిలదీసింది. ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం, అంతా అయిపోయాక... అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుక దోపిడీపై ఎవరూ పట్టించుకోలేదని అంటుండగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. చర్యలు తీసుకోకపోతే అడగండి, కఠిన చర్యల తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం అన్నారు. ఇప్పుడేమంటావ్.. రావద్దంటావా? అంటూ సదరు మహిళపై అసహనాన్ని ప్రదర్శించారు. తన ఉద్దేశం అది కాదని ఆమె చెప్పుకొచ్చింది. అమరావతిలో రోడ్లు వేయడం కాదు, కాస్త మా గురించి కూడా పట్టించుకోండి అని కోరింది. దీంతో మరింత అసహనానికి గురైన లోకేశ్ ఆ మహిళను ఏ ఊరు మీది అని ప్రశ్నించారు. -
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్
-
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్
వర్ధంతి సందర్భంగా అంటూ శుభాకాంక్షలు చెప్పిన వైనం భవానీపురం (విజయవాడ పశ్చిమం) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తప్పుగా ప్రసంగించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అన్నారు. ఆడిటోరియంలో ఉన్నవారు వర్ధంతి కాదు.. జయంతి అని అరవడంతో ఆయన నాలుక్కరుచుకుని.. సారీ.. జయంతి అని సరిదిద్దుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో కూడా లోకేశ్.. శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారని సభికులు గుర్తు చేసుకున్నారు.